Samantha: సమంత వర్కవుట్స్ చేసేది ఎందుకో తెలుసా.? ఆస్తికర విషయాన్ని పంచుకున్న అందాల తార..

|

Dec 31, 2021 | 8:03 AM

Samantha: ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నటీమణుల్లో సమంత ముందు వరుసలో ఉంటారు. నిత్యం వర్కవుట్స్‌ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు సమంత. మంచి శరీరాకృతితో పాటు..

Samantha: సమంత వర్కవుట్స్ చేసేది ఎందుకో తెలుసా.? ఆస్తికర విషయాన్ని పంచుకున్న అందాల తార..
Follow us on

Samantha: ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నటీమణుల్లో సమంత ముందు వరుసలో ఉంటారు. నిత్యం వర్కవుట్స్‌ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు సమంత. మంచి శరీరాకృతితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే క్రమంలో సామ్‌ నిత్యం జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుంటారు. ఇక వాటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం ఈ అందాల తారకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సమంత ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తాను వర్కవుట్స్‌ చేయడానికి ఇదే కారణమంటూ ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటోను పోస్ట్‌ చేశారు సమంత. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

సమంత వర్కవుట్‌ చేస్తున్న సమయంలో ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నేను వర్కవుట్స్‌ చేస్తోంది తినడానికే’ అనే ఓ క్యాప్షన్‌ జోడించారు. ఇక మరో స్టోరీలో తాను వర్కవుట్‌ చేస్తోంది సమోసాలు తినడానికే అన్న అర్థం వచ్చేలా.. ప్లేట్‌లో సమోసాలు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సమోసాలను ఎదురుగా పెట్టుకొని వర్కవుట్స్‌ చేస్తోంది సామ్‌. ఆ సమోసాలను తినాలంటే శరీరంలో క్యాలరీస్‌ తగ్గించాలి, క్యాలరీస్‌ తగ్గాలంటే వర్కవుట్‌ చేయాలి. తన ఈ ఉద్దేశాన్ని సమంత ఇన్‌స్టా పోస్ట్‌ల రూపంలో చెప్పేసిందన్నమాట.

ఇదిలా ఉంటే సమంత ఈ రెండు పోస్టులతో పాటు ఇన్‌స్టాలో మరో ఆసక్తికరమైన స్టోరీని పోస్ట్ చేశారు. ‘మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలు, మన మనసు’ అని ఓ కోటేషన్‌ను పోస్ట్‌ చేశారు. ఇక సామ్‌ కెరీర్‌ విషయానికొస్తే పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అందాల తార, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Also Read: Immunity Booster Bouquet: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. న్యూ ఇయర్ విషెస్‌కు సరికొత్త ఆలోచన..!

Viral video: మీరు రెడీనా.. ఇది న్యూ ఇయర్ స్పెషల్ రెసపీ.. మార్కెట్‌లోకి గుడ్డు గొల్గప్పా వచ్చిందోచ్..

Telangana Politics: సిట్టింగ్ సీటుకు ఎస‌రు పెట్టే ప్రయ‌త్నం.. ఎవరి సీటుకు ముప్పు పొంచిఉందంటే..!