Payal Rajput: నీతో ఉంటే నా జీవితం ఎంతో బాగుంటుంది.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన అందాల పాయల్‌ రాజ్‌పుత్‌..

|

Nov 09, 2021 | 8:36 PM

Payal Rajput: 2018లో వచ్చిన 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఒక్కసారి సంచలనంలా దూసుకొచ్చింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ఉన్నది. ఓవైపు నెగిటివ్‌..

Payal Rajput: నీతో ఉంటే నా జీవితం ఎంతో బాగుంటుంది.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన అందాల పాయల్‌ రాజ్‌పుత్‌..
Payal Rajput
Follow us on

Payal Rajput: 2018లో వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఒక్కసారి సంచలనంలా దూసుకొచ్చింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ఉన్నది. ఓవైపు నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు తన అందంతో కుర్రకారును గుండెల్లో గిలిగింతలు పెట్టించిందీ బ్యూటీ. ఈ సినిమా విజయంతో టాలీవుడ్‌లో ఈ అందాల భామ పేరు ఒక్కసారిగి మార్మోగింది. దీంతో పాయల్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఎన్టీఆర్‌ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే సినిమాలతో నిత్యం బిజీగా గడిపే పాయల్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా హాట్‌ హాట్‌ ఫోటోలతో అభిమానులను ఫిదా చేస్తుంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే పాయల్‌ రాజ్‌పుత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. తన పెంపుడు శునకంతో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘నీతో ఉంటే నా జీవితం ఎంతో బాగుంటుంది.. మై లిటిల్‌ మ్యాన్‌’ అంటూ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇక కెరీర్‌ విషయానికొస్తే పాయల్‌ రాజ్‌పుత్ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: SSC GD Constable Exam 2021: నవంబర్‌ 16 నుంచి SSC GD కానిస్టేబుల్ పరీక్షలు.. హాల్‌టికెట్‌ ఇలా..

T20 World Cup 2021: ఇలా చేశావు ఏంటి బుమ్రా.. తలపై చేతులు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..

Big News Big Debate: బీజేపీ వర్సెస్ వైసీపీ.. పెట్రో మంట.. రాజకీయ తంటా..