Andrea Jeremiah: ప్రేమికుల రోజు.. ఆ హీరోయిన్‏కు మాత్రం బ్లాక్ డే.. ఎందుకంటే..

గతంలో ఆమె తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉన్నారు. కానీ తక్కువ సమయంలోనే వీరిద్దరు విడిపోయారు. ఇందుకు కారణం అతను తనకంటే చిన్నవాడు కావడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Andrea Jeremiah: ప్రేమికుల రోజు.. ఆ హీరోయిన్‏కు మాత్రం బ్లాక్ డే.. ఎందుకంటే..
Andrea Jeremiah

Edited By:

Updated on: Feb 16, 2023 | 6:18 PM

దక్షిణాదిలో ఉన్న సెన్సెషన్ హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. నటిగానే కాదు.. గాయనిగానూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. హిందీ, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఆండ్రియా జీవితంలో ఎన్నో అటు పోట్లు ఉన్నాయి. రెండు సార్లు బ్రేకప్ ఎదుర్కొని మానసికంగా.. శారీరకంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. గతంలో ఆమె తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉన్నారు. కానీ తక్కువ సమయంలోనే వీరిద్దరు విడిపోయారు. ఇందుకు కారణం అతను తనకంటే చిన్నవాడు కావడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ఆ తర్వాత ఒక పెళ్లైన వ్యక్తితో రెండేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి జీవితాన్ని నాశనం చేసుకున్నాని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవడంతో ఆయుర్వేద చికిత్సతో అందులోంచి బయటపడినట్లు చెప్పారు. అయితే తాజాగా ప్రేమికుల దినొత్సవం సందర్భంగా ఇది తనకు బ్లాక్ డే అని ట్వీట్ చేశారు ఆండ్రియా. బ్లాక్ డ్రెస్ ధరించిన తన ఫోటోను షేర్ చేస్తూ.. ప్రజెంట్ సింగిల్ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.

ప్రస్తుతం ఆండ్రియా పిశాచి 2 చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us