Suman : అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు.. హీరో సుమన్ ఎమోషనల్ కామెంట్స్..

ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత సహయ నటుడిగా నటించి మెప్పించారు సుమన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, గాడ్ ఫాదర్ కిట్టు గురించి వెల్లడించారు. కరాటే బ్లాక్ బెల్ట్‌తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, తన తొలి తమిళ చిత్రంలో అనుకోకుండా జరిగిన సంఘటనలను వివరించారు. తెలుగులో భానుచందర్ పరిచయం, "తరంగిణి" సినిమా విజయం, అప్పట్లో ఇతర నటుల గురించి కూడా పంచుకున్నారు.

Suman : అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు.. హీరో సుమన్ ఎమోషనల్ కామెంట్స్..
Suman

Updated on: Oct 25, 2026 | 6:22 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 80వ దశకంలో యాక్షన్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమన్. తనదైన గ్లామర్, కరాటే విద్యతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుమన్ ఓ ఇంటర్వ్యూలో తన తొలి నాటి సినీ జ్ఞాపకాలను, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి తన ఎంట్రీకి కారణమైన కార్ మెకానిక్ కిట్టుని సుమన్ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. కిట్టు గారి సహాయం వల్లే తాను సినీ రంగానికి పరిచయమయ్యానని అన్నారు. కిట్టు సినిమా ప్రపంచంలోనే ఉంటూ సినీ ప్రముఖులకు కార్ ట్రావెల్స్ సేవలు, స్థలాల కొనుగోళ్లలో సహాయం చేసేవారని చెప్పారు. సుమన్ కెరీర్ ప్రారంభంలో ఆయన ఎంతో తోడ్పడ్డారు. అయితే, కిట్టు చనిపోయిన తర్వాతే ఆయన ఫ్యామిలీ నేపథ్యం గురించి తెలిసిందని, సుమన్ ఎప్పుడూ ఇతరుల పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

తనకు మొదట్లో నటన, డ్యాన్స్ తెలియవని, కేవలం కరాటే బ్లాక్ బెల్ట్ ఉన్న ఏకైక అర్హతతో ఇండస్ట్రీలోకి వచ్చానని సుమన్ వెల్లడించారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ టి.ఆర్. రామన్న గారు తన కరాటే నైపుణ్యాన్ని చూసి అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, సినిమా షూటింగ్‌లలో కెమెరాకు ఓవర్‌లాప్ చేస్తూ నిజంగా కొట్టకుండా ఫైట్ చేసే టెక్నిక్ మొదట్లో సుమన్‌కు తెలియకపోవడంతో, తొలి సినిమా ఫైట్ సీన్‌లో ఓ ఫైటర్‌కు పంచ్ గట్టిగా తగిలి రెండు మూడు పళ్లు ఎగిరిపోయాయని సరదాగా గుర్తు చేసుకున్నారు. ఉల్టాగా తానే నిజమైన ఎక్స్‌ప్రెషన్స్ కోసం ఫైటర్లను గట్టిగా కొట్టమని కోరేవాడినని, ఆ తర్వాతే రీల్ ఫైట్ మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

తెలుగులో భానుచందర్ ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ పరిచయం అయ్యారని, ‘ఇద్దరి కిలాడీలు’ సినిమా ఆలస్యం కావడంతో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన ‘తరంగిణి’ సుమన్ తొలి తెలుగు చిత్రంగా విడుదలైందని తెలిపారు. కేవలం 18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘తరంగిణి’ ఏకంగా ఒక సంవత్సరం పాటు థియేటర్లలో ఆడి సంచలనం సృష్టించిందని చెప్పారు. ఇక 1984 కాలంలో ఇతర యువ హీరోలతో పోలిస్తే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నారనే ప్రచారంపై స్పందిస్తూ, తాను ఎప్పుడూ డబ్బును చూసి సినిమాలు చేయలేదని, కథ, క్యారెక్టర్ బాగుంటేనే ఒప్పుకునేవాడినని తెలిపారు. మార్కెట్ పెరిగినప్పుడు రెమ్యునరేషన్ ఆటోమేటిక్‌గా వస్తుందని సుమన్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..

Loading...
Unable to load recommendations.
Follow Us