Murali Mohan : ఆ హీరో చాలా తెలివైనవాడు.. రెమ్యునరేషన్ ఏం చేస్తాడో తెలిసాక ఆశ్చర్యపోయా.. మురళిమోహన్..

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, నటుడిగా తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా అటు నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. అయితే తన డబ్బు సంపాదన గురించి.. మనీ సేవింగ్స్ గురించి ఇదివరకు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఆయన.. తాజాగా ఓ హీరో రెమ్యునరేషన్ డబ్బులు ఏం చేస్తారో తెలిసాక తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.

Murali Mohan : ఆ హీరో చాలా తెలివైనవాడు.. రెమ్యునరేషన్ ఏం చేస్తాడో తెలిసాక ఆశ్చర్యపోయా.. మురళిమోహన్..
Murali Mohan

Updated on: Oct 16, 2026 | 9:45 AM

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు, ఆర్థిక విషయాల్లోనూ ఎంతటి తెలివైన వ్యక్తి అనే విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ వెల్లడించారు. శోభన్ బాబు భూమిపై చేసిన పెట్టుబడుల వెనుక ఉన్న అద్భుతమైన ఆలోచనను ఆయన వివరించారు. శోభన్ బాబును ఒకసారి, “మీరు పెద్ద హీరో, పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఎక్కడ పెట్టుబడులు పెడతారు?” అని అడగగా, ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారట. ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రం ఉందని, కేవలం ఒకవంతు మాత్రమే భూమి ఉందని శోభన్ బాబు గుర్తుచేశారు. ఈ భూమిలో కూడా మంచు పర్వతాలు, ఎడారుల వంటి నివాసయోగ్యం కాని ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, నివాసయోగ్యమైన స్థలాలు చాలా తక్కువని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో భూమికి భారీ డిమాండ్ ఏర్పడుతుందని, రేట్లు అసాధారణంగా పెరుగుతాయని ఆయన ముందుగానే అంచనా వేశారు. అందుకే తన సంపాదన మొత్తాన్ని భూమి కొనుగోలుపైనే వెచ్చిస్తున్నానని చెప్పారట. శోభన్ బాబు ఎంత గొప్ప దూరదృష్టి, వ్యాపార దక్షత కలిగిన వ్యక్తి అని మురళీ మోహన్ ప్రశంసించారు. ఆయన నిర్ణయాలు ఎప్పుడూ చాలా లెక్కలతో కూడుకొని, అత్యంత జాగ్రత్తగా ఉంటాయని మురళీ మోహన్ తెలిపారు. ఇది శోభన్ బాబు ఆర్థిక మేధస్సును స్పష్టం చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

సరైన సమయంలో, సరైన సలహా ఎంత విలువైనదో ఆ క్షణం తనకు అర్థమైందని అన్నారు మురళి మోహన్. శోభన్ బాబు గారి దూరదృష్టితో కూడిన ఈ సూచనతో ప్రేరణ పొందిన ఆయన, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి గొప్ప విజయం సాధించారు. నేటికీ ఆయన విజయానికి ఆనాటి శోభన్ బాబు సలహానే ప్రాతిపదిక అని మురళీ మోహన్ తరచూ చెబుతుంటారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

శోభన్ బాబు..

Sobhan Babu

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us