Oscar Voting: ఆస్కార్‌ అవార్డుల కోసం ఓటింగ్‌ పూర్తి.. త్వరలో విజయం సాధించిన సినిమాల ప్రకటన..

ఆస్కార్‌ అవార్డుల కోసం ఓటింగ్‌ పూర్తయింది. ఇందులో విజయం సాధించిన చిత్రాలను త్వరలో ప్రకటించనున్నారు. ఆయా చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌లో తలపడనున్నాయి.

Oscar Voting: ఆస్కార్‌ అవార్డుల కోసం ఓటింగ్‌ పూర్తి.. త్వరలో విజయం సాధించిన సినిమాల ప్రకటన..
Oscar
Follow us

|

Updated on: Jan 20, 2023 | 12:43 PM

ఆస్కార్‌ అవార్డుల కోసం ఓటింగ్‌ పూర్తయింది. ఇందులో విజయం సాధించిన చిత్రాలను త్వరలో ప్రకటించనున్నారు. ఆయా చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌లో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్కార్‌ 2023 అవార్డుల ప్రదానోత్సవం కోసం ఓటింగ్‌ విజయవంతంగా పూర్తైంది. సుమారు 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన చిత్రాలు, నటీనటులకు ఓటు వేశారు. అయితే, ఈ ఏడాది ఆస్కార్‌ ఓటింగ్‌ మరింత ప్రాధాన్యత సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక మంది సభ్యులు ఈ సారి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 95 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్‌ జరగడం ఇదే మొదటిసారి.

ఈ సారి అకాడమీ అవార్డుల నామినేషన్స్‌ కోసం ఇండియా తరఫు నుంచి 10 సినిమాలు పోటీ పడుతున్నాయి. RRR, ది కశ్మీర్‌ ఫైల్స్‌, కాంతార, విక్రాంత్‌ రోణ, గంగూభాయి కతియావాడి, మి వసంతరావ్‌, తుజ్యా సాథీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్‌ నిళల్‌, వంటి చిత్రాలు ఓపెన్‌ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. నామినేషన్స్‌ కోసం పోటీ పడుతోన్న చిత్రాలకు జనవరి 11 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సైతం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 24న ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో లాస్ట్‌ ఫిల్మ్‌ షో, ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో RRR నుంచి ‘నాటునాటు, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ది ఎలిఫెంట్‌ విష్పెర్స్‌ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!