నందిగ్రామ్ యాంటీ-క్లైమాక్స్ , మమతా బెనర్జీకి చిన్న గాయమే, సువెందు అధికారి గెలిచినా, ప్చ్ !

| Edited By: Anil kumar poka

May 03, 2021 | 1:06 PM

బెంగాల్ ఎన్నికల్లో తాను పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గం లో ఓటమి మమతా  బెనర్జీకి వ్యక్తిగతంగా చిన్న గాయమే..కానీతన  నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం...

నందిగ్రామ్ యాంటీ-క్లైమాక్స్ , మమతా బెనర్జీకి చిన్న గాయమే, సువెందు అధికారి గెలిచినా, ప్చ్ !
Nandigram Anti Climax
Follow us on

బెంగాల్ ఎన్నికల్లో తాను పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గం లో ఓటమి మమతా  బెనర్జీకి వ్యక్తిగతంగా చిన్న గాయమే..కానీతన  నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం  ఆమెకు పెట్టని కోటలా నిలిచింది. ఈ అఖండ విజయం ముందు ఇది ఈమెకు స్వల్ప గాయమైనప్పటికీ..తను ఎంతో ఆశ పెట్టుకున్న ఈ నియోజకవర్గ ప్రజలు తనను కాస్త పక్కన పెట్టడం ఆమెకు నిరాశనే కలిగించింది. బెంగాల్ లో జరిగిన అతి పెద్ద రాజకీయ పోరాటాల్లో నిన్నటి పరిణామం ఆమెకు కలవరాన్ని కలిగించింది. ఇక్కడ తన విజయం ఖాయమని ఆమె భావించారు. అందువల్లే తాను మొదట పోటీ చేయదలిచిన భవానీపూర్ నియోజకవర్గాన్ని కూడా వదులుకుని నందిగ్రామ్ ని ఎంచుకున్నారు., ఈమెపై బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి విజయం సాధించినప్పటికీ ఇది ఆయనకు సంతృప్తిని కలిగించలేదు. మమతపై 50 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధిస్తానని  ఆయన గొప్పలకు పోయారు. అంత బీరాలు పలికిన ఆయన ఇప్పుడు బేర్ మంటున్నారు. ఇది ఆయనకు దక్కిన దయనీయ విజయమే.. దీనివల్ల అధికారి పెద్దగా సాధించిందేమీ లేదు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లను మమత ప్రభుత్వం నెత్తికెత్తుకోవడాన్ని ఆయన సహించలేకపోయారు.  70 శాతం హిందువులు, 30 శాతం ముస్లిములు ఉన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి అధికారి చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నందిగ్రామ్ లో తన ఓటమిని హుందాగా దీదీ స్వీకరించారు. తాను ఓడిపోయినా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటానని ఆమె అంటున్నారు. అయినా ఈ ఓటమిపై సందేహాలు వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. పోలైన ఓట్లను తిరిగి లెక్కించాలని కోరినా..ఈసీ ఆమె డిమాండును తిరస్కరించింది.  ఏమైనా తమ బెంగాలీ  కూతురును తృణమూల్  కాంగ్రెస్ అత్యంత  ప్రాధాన్యత కలిగిన ‘పీఠం’ పై కూర్చోబెట్టడానికే యత్నిస్తోంది.  ఈ ఎన్నికల్లో దీదీకి తాము గట్టి పోటీనివ్వగలిగామని మాత్రం బీజేపీ కాస్త సంబరపడుతోంది. కానీ-ఈసీ జోక్యం చేసుకోకపోతే ఆ పార్టీ ఇన్ని సీట్లయినా గెలిచేది కాదని మమత వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.
మరిన్ని చదవండి ఇక్కడ : బాలయ్య ‘అఖండ’ పైనే ప్రజ్ఞ జైస్వాల్ ఆశలు అన్ని.. Pragya Jaiswal video.
మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …