Assam Assembly Elections 2021: అస్సాం మంత్రి బిశ్వ‌శ‌ర్మ‌పై ఈసీ ఆగ్ర‌హం.. 48గంటల పాటు ప్రచారంపై నిషేధం

|

Apr 03, 2021 | 1:16 AM

Assam polls - Himanta Biswa Sarma: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా అసోం మంత్రి, బీజేపీ నాయ‌కుడు హిమంత బిశ్వ‌శ‌ర్మ‌పై

Assam Assembly Elections 2021: అస్సాం మంత్రి బిశ్వ‌శ‌ర్మ‌పై ఈసీ ఆగ్ర‌హం.. 48గంటల పాటు ప్రచారంపై నిషేధం
Assam Polls Himanta Biswa Sarma
Follow us on

Assam polls – Himanta Biswa Sarma: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా అస్సాం మంత్రి, బీజేపీ నాయ‌కుడు హిమంత బిశ్వ‌శ‌ర్మ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం 48 గంట‌ల నిషేధం విధించింది. కాంగ్రెస్ పార్టీ మిత్ర‌ప‌క్షం బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చైర్‌ప‌ర్స‌న్ హంగ్రామా మొహిల‌రీకి వ్య‌తిరేకంగా బిశ్వశర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న‌పై ఈసీ ఈ నిషేధం విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హిమంత బిశ్వ శ‌ర్మ వ్యాఖ్య‌లు, ప్ర‌క‌ట‌న‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏప్రిల్ రెండో తేదీ నుంచి 48 గంట‌ల పాటు బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, రోడ్‌షోలు నిర్వ‌హించ‌డం, మీడియాతో మాట్లాడటం, సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం లాంటివి చేయకూడదంటూ ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ చైర్‌ప‌ర్స‌న్ హంగ్రామా మొహిల‌రీని బ‌హిరంగంగా బెదిరించార‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ను అడ్డం పెట్టుకుని జైలుకు పంపుతామ‌ంటూ.. మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ హెచ్చ‌రించారని.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఒక‌వేళ హంగ్రామా వేర్పాటువాద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే జైలుకెళ్తాడు.. ఆయుధాల స్వాధీనంపై చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీనిపై ఎన్ఐఏ ద‌ర్యాప్తుకు ఆదేశిస్తాం.. జైలుకు పంపుతాం అంటూ హంగ్రామాను నేరుగా హిమంత బిశ్వ శ‌ర్మ బెదిరించార‌ు. అయితే దీనిపై శుక్రవారం నాటికి వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొనగా.. బిశ్వశర్మ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది.

అయితే.. 126 స్థానాలు ఉన్న అస్సాంలో మార్చి 27న తొలి విడత, ఏప్రిల్‌ 1న రెండో విడత పోలింగ్‌ పూర్తయింది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్‌ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.

Also Read:

PM Modi in Kerala : అయ్యప్ప భక్తులకు లాఠీ దెబ్బలు కాదు, పుష్పాలను కానుకగా ఇవ్వండి, స్కాంలకు కేరళ అడ్డాగా మారిందన్న మోదీ

IT Raids : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడుల దడ, వందల కోట్ల రూపాయలు స్వాధీనం