CM Revanth: సీఎం రేవంత్ కు ఏఐసీసీ కీలక బాధ్యతలు.. ఆ రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెనింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి టాక్టివ్ పర్సన్. బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీలపై ఘాటు వాఖ్యలు చేస్తూ ఇరుకున పడేలా వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు ఏఐసీసీ కూడా రేవంత్ సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో

CM Revanth: సీఎం రేవంత్ కు ఏఐసీసీ కీలక బాధ్యతలు.. ఆ రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెనింగ్
Cm Revanth
Follow us

|

Updated on: Apr 03, 2024 | 7:08 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి టాక్టివ్ పర్సన్. బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీలపై ఘాటు వాఖ్యలు చేస్తూ ఇరుకున పడేలా వ్యవహరిస్తుంటారు. అయితే  ఇప్పుడు ఇదే కారణంతో ఏఐసీసీ కూడా రేవంత్ సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. అవసరాన్ని బట్టి రేవంత్ సేవలను ప్రచారానికి వినియోగించుకోవడంపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోనుంది.

అరుణాచల్ ప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కింది. అరుణాచల్ ప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఆయనకు చెందిన కంపెనీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించిన పలు కాంట్రాక్ట్ పనులను పూర్తి చేయడంతో ఆయనను గుర్తించింది. జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న మరో నేత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2009 లో మొరాదాబాద్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైనప్పటికీ ఉత్తర ప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అతని పేరు లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

బీజేపీ నేతలకు దక్కని చోటు

ఇదిలావుండగా మధ్యప్రదేశ్ పార్టీ ఇంచార్జీగా ఉన్నప్పటికీ బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేదు. అదేవిధంగా కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించలేదు. తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలను కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. యూపీ, అరుణాచల్, జమ్ముకశ్మీర్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ముగ్గురూ ప్రచారం చేయనున్నారు.

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త