‘మజిలీ’ని ఎన్నికలు కమ్మేస్తాయా?

అక్కినేని స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు జోడిగా నటిస్తున్న చిత్రం మజిలీ. పెళ్లి తరువాత చైయ్-సామ్‌లు కలిసి నటిస్తున్న మూవీ కావటంతో మజిలీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. సమ్మర్‌ సీజన్‌ కావటంతో కలెక్షన్లు కూడా బాగుంటాయని ఆ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. నిన్నకోరి ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు. అయితే ఇప్పుడు […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:21 pm, Tue, 12 March 19

అక్కినేని స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు జోడిగా నటిస్తున్న చిత్రం మజిలీ. పెళ్లి తరువాత చైయ్-సామ్‌లు కలిసి నటిస్తున్న మూవీ కావటంతో మజిలీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. సమ్మర్‌ సీజన్‌ కావటంతో కలెక్షన్లు కూడా బాగుంటాయని ఆ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. నిన్నకోరి ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎలక్షన్‌ల హడావిడితో మజిలీకి కష్టాలు తప్పేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ప్రభావం మజిలీ కలెక్షన్ల మీద పడే ప్రభావం ఉందని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ పరిస్థితుల్లో మజిలీని చెప్పిన డేట్‌కే రిలీజ్ చేస్తారా? లేక వాయిదా వేస్తారా అన్నది చూడాలి. అదే రోజు విడుదల కావాల్సిన నాని జెర్సీ సినిమాను ఇప్పటికే ఏప్రిల్‌ 19కి పోస్ట్ పోన్ అయ్యింది.