మిజోరాంలో మరోసారి భూకంపం

మిజోరాం రాష్ట్రంలో గత నెలరోజులుగా పలు జిల్లాల్లో వరుసగా భూమి ప్రపకంపనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం చంపాయ్‌ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ నైరుతి ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.

మిజోరాంలో మరోసారి భూకంపం
Follow us

|

Updated on: Jul 05, 2020 | 7:53 PM

మిజోరాం రాష్ట్రంలో గత నెలరోజులుగా పలు జిల్లాల్లో వరుసగా భూమి ప్రపకంపనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం చంపాయ్‌ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ నైరుతి ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. జూన్‌ 3న చంపాయ్‌ ప్రాంతంలో ఇదే తీవ్రతతో భూమి కంపించగా జూన్‌ 22న చంపాయ్‌ జిల్లాకు 27కిలోమీటర్ల దూరంలోని నైరుతి ప్రాంతంలో 5.5తీవ్రతతో భూకంపం సంభించింది. జూన్‌ 21న ఐజ్వాల్‌కు 25కిలోమీటర్ల దూరంలో తూర్పు-ఈశాన్యం ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై మిజోరాం విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివ కుమార్ మాట్లాడుతూ.. భూ అంతర్ భాగంలో మూడు, నాలుగు ఫాల్ట్‌లైన్‌లు ఉన్నాయని, వాటిలో ఎక్కువ భాగం దక్షిణ మిజోరాం, మయన్మార్‌కు ఆనుకొని మాట్ నది లోపల ఉన్నాయని చెప్పారు. వీటిపై అధ్యయనం కొనసాగుతుందన్నారు. దీనిపై పూర్తి డేటాను సేకరించడానికి భౌతిక శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని చంపై జిల్లాకు పంపించామన్నారు.