అండమాన్‌లో మరోసారి భూకంపం..

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం కలకలం రేపుతోంది. శుక్రవారం నాడు ఉదయం పదిన్నర ప్రాంతంలో ఓ సారి భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రిక్టార్ స్కేలుపై భూకంప 4.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. అయితే..

అండమాన్‌లో మరోసారి భూకంపం..
Earthquake
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 11:39 PM

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం కలకలం రేపుతోంది. శుక్రవారం నాడు ఉదయం పదిన్నర ప్రాంతంలో ఓ సారి భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రిక్టార్ స్కేలుపై భూకంప 4.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. అయితే ఈ భూకంపం వచ్చి పన్నెండు గంటలు కూడా గడవకముందే.. మరో సారి రాత్రి 8.12 గంటలకు భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్‌ దీవుల్లోనే రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. క్యాంప్‌బెల్‌ తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిళ్లలేదని పేర్కొంది.

కాగా, గడిచిన కొద్ది రోజులుగా దేశంలో ఏదో ఓ ప్రాంతంలో భూకంపాలు వణికిస్తున్నాయి. అయితే ఇవి తక్కువ తీవ్రతతో నమోదవుతుండటంతో.. ఎలాంటి నష్టం వాటిళ్లడం లేదు.