రూ. 241 కోట్లతో.. దుబాయ్ రాజు భార్య పరారీ

యూఏఈ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార్య ఇంటి నుంచి వెళిపోయారు. రూ. 241 కోట్లతో తన ఇద్దరు పిల్లలతో రహస్యంగా పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవలే భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె, తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. ఓ జర్మనీ దౌత్తవేత్త సాయంతో లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో తన ప్రాణాలకు ముప్పు ఉందనే ఆమె ఈ పని చేసిందని, తనకు జర్మనీలో ఆశ్రయం ఇవ్వాలని […]

రూ. 241 కోట్లతో.. దుబాయ్ రాజు భార్య పరారీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 11:07 AM

యూఏఈ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార్య ఇంటి నుంచి వెళిపోయారు. రూ. 241 కోట్లతో తన ఇద్దరు పిల్లలతో రహస్యంగా పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవలే భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె, తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. ఓ జర్మనీ దౌత్తవేత్త సాయంతో లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో తన ప్రాణాలకు ముప్పు ఉందనే ఆమె ఈ పని చేసిందని, తనకు జర్మనీలో ఆశ్రయం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. కాగా, హయా జోర్డన్ రాజుకు వరుసకు సోదరి. 2004లో రషీద్‌తో ఆమెకు పెండ్లి జరిగింది. గతేడాది షేక్ మహమ్మద్ కూతురు ప్రిన్సెస్ లతిఫా పారిపోయేందుకు యత్నించగా, ఇండియ‌న్ కోస్ట్‌లో పట్టుకున్నారు. కూతురు మాదిరే హయా కూడా భర్త వేధింపులు తట్టుకోలేక అదే పని చేసిందని మానవ హక్కుల కార్యకర్త రాధా స్టిర్లింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై షేక్ మహమ్మద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె మోసం చేసిందని ఆరోపించారు. ఎవరి కోసం నువ్వు లండన్ వెళ్లావ్..? అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మండిపడ్డాడు. ఇక ఆమె చనిపోయినా నాకు సంబంధం లేదని మహమ్మద్ బిన్ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే హయా రాకపై లండన్ ప్రభుత్వం, దుబాయ్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.