Breaking News
  • భారత్-చైనా సరిహద్దుల్లోని డోక్లాంలో మళ్లీ అలజడి. 2 శక్తివంతమైన సర్వైలెన్స్ కెమేరాలను ఏర్పాటు చేసిన చైనా. వివాదాస్పద స్థలానికి దారితీసే రోడ్డు రిపేర్. 2017లో 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు. లద్దాఖ్ ఉద్రిక్తతల మళ్లీ కుట్రలు పన్నుతున్న చైనా.
  • తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ లొంగిపోయిన మావోలు. కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పేర్లు కొవ్వాసి సునీత. కలుమ మనోజ్ . లొంగిపోయిన మావోయిస్టులకు 5 వేల ఆర్థిక సహాయం చేసిన జిల్లా ఎస్పీ.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చం నాయుడు కు కరోనా పాజిటివ్. కోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు హైకోర్టుకు లేఖ రాసిన గుంటూరు రమేష్ హాస్పటల్. అచ్చెన్నాయుడు కు కరోనా పాజిటివ్ అని లేఖలో హైకోర్టు కు తెలిపిన రమేష్ హాస్పిటల్స్. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతున్నఅచ్చెన్నాయుడు ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్ చేసిన ఆస్పత్రి సిబ్బంది.
  • చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఫై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు. కరోనా వైరస్ నిర్ధారణ కావడం తో ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం . ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగ్గా ఉంది . శరీరం లో ఆక్సిజన్ లెవల్స్ నిలకడగా ఉన్నాయ్ . వైద్యుల పర్యవేక్షణలో మెరుగయిన వైద్య చికిత్స అందిస్తునాం.
  • విజయవాడ : రమేష్ హాస్పిటల్ లీలలు. ఒక్కొక్కటిగా రమేష్ హాస్పిటల్ అక్రమాలు. నాలుగురోజుల గా పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ లో మే 18 న కోవిడ్ కేర్ సెంటర్ కు అనుమతి కోరిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం . కాని మే 15 నుంచే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్‌. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లకు నిర్వహణ. స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదంతో బయటపడ్డ అక్రమాలు.
  • అమరావతి: ‘దిశ’ చట్టం అమలుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా అధికారులు హాజరు.
  • కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం.

సర్వరోగ నివారిణి..‘దూద్‌బావి’ నీళ్లు..ఎక్కడుందో తెలుసా..?

villagers believe that drinking well water cures diseases in karimnagar, సర్వరోగ నివారిణి..‘దూద్‌బావి’ నీళ్లు..ఎక్కడుందో తెలుసా..?

‘దూద్‌బావి’ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన మంచినీటి బావి..ఇందులో నీరు చాలా స్పష్టంగా ఉంటాయి. నోట్లో పోసుకుంటే తీయగా ఉంటుందట. దాహం వేసిన వారు వెంటనే ఓ అరలీటర్ నీటిని తాగేస్తారట. అంతేకాదు..ఏళ్ల నుంచి అక్కడి బావి నీటికి మరో విశిష్టత కూడా ఉంది. ఆ నీరు తాగితే సర్వరోగాలు తొలగిపోతాయని అక్కడి స్థానికుల విశ్వాసం. అయితే, ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలోనూ అక్కడి బావి నీళ్లు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంతటి ప్రాముఖ్యతల గల బావి ఎక్కడో కాదు.. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలోని ‘దూద్‌బావి’ ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. మొలంగూర్లో సైనికుల కోసం కాకతీయ రాజులు ఈ బావిని తవ్వించారట. ఈ బావి నీరు చాలా తీయగా, స్వచ్ఛంగా ఉంటాయి. అంతేకాదు, ఏ కాలం అయిన సరే బావి జలతో నిండుకుండలా ఉంటుంది. ఈ నీళ్లలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఏ మాత్రం కనపడవు. అప్పట్లో ఈ నీళ్లను గుర్రపు బగ్గీల్లో హైదరాబాద్‌లోని నిజాం నవాబు కుటుంబానికి సరఫరా చేసేవారని చరిత్ర చెబుతోంది. కాగా, ఇప్పటికీ చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు చాలా మంది ఇక్కడ్నుంచి నీటిని తీసుకువెళ్తుంటారు.

ఈ బావికి చుట్టుపక్కల మర్రి చెట్లు, చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు.. రాతి గోడలు ఉండడం విశేషం. దూద్‌బావిలోని పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు తాగితే సర్వ రోగాలు తొలగిపోతాయనేది స్థానికుల నమ్మకం. ఈ బావి నీళ్లకు ప్రత్యేకత ఉండడంతో ఏళ్ల తరబడి చాలా మంది ఇవే నీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నీటిలో ఖనిజ లవణాలు మెండుగా ఉండడంతో ఈ నీటిని తాగిన వారికి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఈ నీళ్లను పరీక్షించిన ప్రభుత్వం..వీటిలో స్వచ్ఛమైన అధిక లవణాలు పోషక పదార్థాలు చాలా ఉన్నాయని గుర్తించారు. అప్పటి నుంచి ఈ గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లా వాసులు కూడా ఈ నీటిని తీసుకెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజలందరినీ వణికిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి కూడా బయటపడేందుకు దూద్‌బావి నీరు ఉపకరిస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి దూద్‌బావి నీటి కోసం బారులు తీరుతున్నారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు

పుట్టినరోజు వేడుకలో విషాదం..ఈతకెళ్లిన విద్యార్థులు గల్లంతు

పెళ్లి ఇంట విషాదం…మూడో రోజే నవ వధువు ఆత్మహత్య

ఈ మేకలను బలిస్తే రక్తం రాదట..!

విశాఖ షిప్ యార్డ్‌లో కూలిన భారీ క్రేన్..10 మంది మృతి..

 

Related Tags