Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

తల్లిని మించిన యోధులు ఎవ్వరూ ఉండరు… ఈ తల్లి కుక్క ఏం చేసిందో తెలుసా?

Dog fight ,dangerous snake, Nagole RTA offfice, snakes in Rta offfice

సృష్జిలో జీవి ఏదైనా సరే తల్లి ప్రేమ ఒక్కలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరంటూ ఇటీవల ఓ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ గుర్తుకు వచ్చేలా ఓ తల్లి కుక్క  సాహసం  చేసింది.  ఓ  కుక్క తన పిల్లల్ని విషసర్పం నుంచి కాపాడుకోడానికి ఎంతో పోరాడింది. అయితే తన రెండు కుక్కపిల్లల్ని కాటు వేయడంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఓ కుక్క రెండు రోజుల క్రితమే మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. అది ఉంటున్న షెడ్డులోకి పాము ప్రవేశించడం చూసిన తల్లికుక్క పెద్దగా మొరుగుతూ పిల్లల్ని కాపాడుకోబోయింది. అప్పటికే బుసలు కొడుతున్న పాము .. కుక్క పిల్లల్ని కసిగా కాటువేయగా రెండు కుక్కపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. దీంతో కుక్క మరింత గట్టిగా మొరగడంతో పాము అక్కడినుంచి మెల్లగా జారుకుంది. ఈ ఘటనలో మరో కుక్కపిల్ల ప్రాణాలతో బయటపడింది.

నాగోల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద శుక్రవారం అంత చూస్తుండగానే ఆరున్నర అడుగుల నాగుపాము గోడ దాటి ఆదర్శ నగర్‌పై వెళ్లింది. దీన్ని గమనించి సెక్యూటీగార్డు స్ధానికులను అప్రమత్తం చేయడానికి వెళ్లేలోపు అక్కడున్న ఓ షెడ్డులో దూరింది. అక్కడ రెండు రోజుల క్రితమే ఓ కుక్క మూడు పిల్లలకు జన్మనిచ్చింది. పాము రాకను గమనించిన పెద్దగా అరవడంతో స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పాముకాటుతో .. ఇంకా కళ్లు కూడా తెరవని తన రెండు పిల్లల్ని పోగొట్టుకుంది. ఈ ఘటనతో స్ధానికలు చలించిపోయారు.

నాగోల్ ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో విష సర్పాలు విపరీతంగా తిరుగుతున్నాయి. కార్యాలయానికి వివిధ పనులమీద వచ్చేవారిని సైతం ఈ పాములు తరచూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. చుట్టూ పచ్చిక ఉండటంతో పాముల బెడద ఎక్కువుగా ఉందని కార్యాలయానికి వచ్చే వారు చెబుతున్నారు. ఇప్పటికైన పరిసరాల్లో ముళ్లపొదలు లేకుండా చూడాలని కోరుతున్నారు.