17 ఏళ్లుగా వ్యక్తి మెదడులో నివాసమున్న ‘వార్మ్‌’.. ఎట్టకేలకు బయటకు

ఒకటి, రెండేళ్లు కాదు 17 ఏళ్లుగా ఓ వ్యక్తి మెదడులో వార్మ్‌(పరాన్న జీవి) నివసిస్తోంది. దాన్ని చూసిన డాక్టర్లు షాక్‌కి గురయ్యారు

17 ఏళ్లుగా వ్యక్తి మెదడులో నివాసమున్న 'వార్మ్‌'.. ఎట్టకేలకు బయటకు
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 1:45 PM

Doctors find 5-inch live worm: ఒకటి, రెండేళ్లు కాదు 17 ఏళ్లుగా ఓ వ్యక్తి మెదడులో వార్మ్‌(పరాన్న జీవి) నివసిస్తోంది. దాన్ని చూసిన డాక్టర్లు షాక్‌కి గురయ్యారు. ఆపరేషన్‌ చేసి ఎలాగైనా దాన్ని బయటకు తీయగా.. అది 5 అంగుళాల పొడవు ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన చెన్‌(23) ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే చేతులు, కాళ్లలో స్పర్శ లేకుండా పోయింది. అంతేకాదు అప్పుడప్పుడు అతడికి తీవ్ర తలనొప్పి వచ్చేది. అయితే తన తల్లి దండ్రులకు కూడా చేతులు, కాళ్లలో స్పర్శ లేకపోవడంతో.. వంశపారపర్యంగా తనకు ఈ లక్షణాలు వచ్చాయని చెన్ భావించారు.

కాగా 2015లో తన శరీరంలో సగానికి పైగా స్పర్శఙ్ఞానం లేకుండా పోవడంతో కంగారు పడిన ఆ యువకుడు డాక్టర్లను సంప్రదించాడు. ఈ క్రమంలో ఉచాంగ్ యూనివర్సిటీలోని డాక్టర్లు, ఉడకని మాంసం తినడంతోనే చెన్‌కి ఈ లక్షణాలు వచ్చాయని భావించారు. కానీ తరువాత చెన్ మెదడుకు సిటీ స్కాన్ చేయగా.. అందులో వార్మ్‌ ఉన్నట్లు గుర్తించి షాక్‌కి గురయ్యారు. గత 17 ఏళ్లుగా ఆ వార్మ్‌ మెదడులో ఉండటంతో.. అతడిలోని అవయవాల్లో స్పర్శ లోపించిందని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆగష్టు 25న చెన్‌కి ఆపరేషన్ నిర్వహించి వార్మ్‌ని తొలగించారు. అయితే 2015లోనే వార్మ్‌ని గుర్తించినప్పటికీ.. ఆపరేషన్ చేసేందుకు అది సరైన పొజిషన్‌లో లేకపోవడంతో, ఐదు సంవత్సరాల సమయం పట్టింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, ప్రస్తుతం అతడు కోలుకున్నాడని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

Read More:

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. పరుగులు తీయనున్న మెట్రో

‘ఆహా’ వెబ్‌సిరీస్‌లో రేణు దేశాయ్‌..!