గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కనున్న అయోధ్య.. ఎందుకంటే..!

శ్రీరాముడు జన్మించిన అతి పవిత్రమైన అయోధ్య నగరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అసలు విషయానికొస్తే.. దీపావళిని పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం అయోధ్యలో 5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ‘దీపోత్సవం’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ  దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా.. లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. అద్భుతంగా కన్నుల పండుగ […]

గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కనున్న అయోధ్య.. ఎందుకంటే..!
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2019 | 2:03 PM

శ్రీరాముడు జన్మించిన అతి పవిత్రమైన అయోధ్య నగరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అసలు విషయానికొస్తే.. దీపావళిని పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం అయోధ్యలో 5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ‘దీపోత్సవం’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ  దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా.. లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. అద్భుతంగా కన్నుల పండుగ జరిగే ఈ దీపోత్సవానికి  భక్తులు కూడా భారీగా తరలిరానున్నారు. దీని కోసం సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.

ఇక ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొనున్నారు. అయోధ్య దీపోత్సవంలో ఈ ఉదయం 10 గంటల నుంచి ఊరేగింపు కూడా ప్రారంభమైంది. సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొన్నారు. సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు. ఇక ఈ రాత్రి చేపట్టనున్న ‘దీపోత్సవం’ గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలవనుంది. కాగా 2018 లో యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం సరయు నదీ తీరంలో 3 లక్షల 150 మంటి మట్టి దీపాలను వెలిగించి ‘దీపోత్సవ’ వేడుకలు చేసిన విషయం తెలిసిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు