Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

జక్కన్న సినిమా.. ఎన్ని భాషల్లో చూడాలంటే ?

It has been a phenomenal year for everyone in the team of RRR, జక్కన్న సినిమా.. ఎన్ని భాషల్లో చూడాలంటే ?

ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా పది.. ఇదేదో జూనియర్ కాలేజ్ ర్యాంకింగ్స్ యాడ్ లా కనిపించినా విషయం వేరు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా పది భాషల్లో ధియేటర్లలో విడుదల కాబోతుందట.

ఇప్పటికే అలియాభట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్ లాంటి స్టార్ స్టడెడ్ కాస్టింగ్ తో ఈ సినిమా అంచనాలు ఆకాశానికి చేరాయి.ప్రస్తుతం ఈ మూవీ పది భాషల్లో రిలీజవుతుందనే వార్త దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని అమాంతం పెంచేసింది.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి పాత్రల మధ్య నడిచే కల్పిత స్టోరీగా వస్తున్నపీరియాడిక్ డ్రామా ఈ మూవీ. ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్లతో పాటు, హాలీవుడ్ నుంచి అలిసన్ , రే స్టీవెన్సన్ లని కూడా తీసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలిసన్ ఇప్పటికే ఎ వ్యూ టు కిల్ ,ఇండియానా జోన్స్, ది లాస్ట్ క్రూసేడ్ వంటి చిత్రాలలో భాగం కాగా.. రే స్టీవెన్సన్ థోర్ , కింగ్ ఆర్థర్ సినిమాల్లో కనిపించాడు. మొత్తానికి, 2020 లో తెరపైకి రానున్న ఈ మూవీ 10 భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది.

It has been a phenomenal year for everyone in the team of RRR, జక్కన్న సినిమా.. ఎన్ని భాషల్లో చూడాలంటే ?