Gautham Menon : స్టార్ హీరో సినిమాలో విలన్‌‌‌గా టాప్ డైరెక్టర్.. శిష్యుడి కోసం ఇలా…

అందమైన ప్రేమకథలను తెరకెక్కించడం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచుకున్నాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను నిజంగానే మాయచేసాడు...

Gautham Menon : స్టార్ హీరో సినిమాలో విలన్‌‌‌గా టాప్ డైరెక్టర్.. శిష్యుడి కోసం ఇలా...
Follow us

|

Updated on: Jan 29, 2021 | 8:38 AM

Gautham Menon : అందమైన ప్రేమకథలను తెరకెక్కించడం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచుకున్నాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను నిజంగానే మాయచేసాడు ఈ స్టార్ డైరెక్టర్. ఒక్క లవ్ స్టోరీస్ లోనే కాదు యాక్షన్ సినిమాలతోను ఆకట్టుకున్నాడు గౌతమ్ మీనన్. ఇలా  ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్. ఇటీవల పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కనిపించి అలరిస్తున్నారు. ఈసారి ఆయన ఏకంగా విలన్ గా మారబోతున్నాడని తెలుస్తుంది. కృష్ణ ఎన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందబోతున్న ‘పతు తల’ అనే సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కృష్ణ ఎన్ గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. శిష్యుడి కోరిక మేరకు గౌతమ్ మీనన్ ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. మరో వైపు హీరో శింబు తో గౌతమ్ మీనన్ కు మొదటినుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శింబు అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అటు గౌతమ్ మీనన్ దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తున్న ‘నవరస’లో ఒక ఎపిసోడ్ ను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి చిన్న కూతురు.. ముహూర్తం ఫిక్స్ చేసిన బోనికపూర్.!