మహేంద్ర సింగ్ ధోనీ : తుఫాన్ ముందు నిశ్శబ్దం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినా పొట్టి క్రికెట్ యుద్దం ఐపీఎల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం ముంబై ఇండియన్స్,  చెన్నై సూపర్ కింగ్స్  అబుదాబిలో బరిలోకి దిగాయి.

మహేంద్ర సింగ్ ధోనీ : తుఫాన్ ముందు నిశ్శబ్దం
Follow us

|

Updated on: Sep 19, 2020 | 8:45 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినా పొట్టి క్రికెట్ యుద్దం ఐపీఎల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం ముంబై ఇండియన్స్,  చెన్నై సూపర్ కింగ్స్  అబుదాబిలో బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్  ఎంచుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ధోనీ అభిమానుల సందడి మొదలైంది. మైదానంలో ధోనీ, ధోనీ, ధోనీ అంటూ తమ అభిమానాన్ని చూపించే అవకాశం లేకపోవడంతో ఆ లోటును సోషల్ మీడియా వేదికగా తీర్చుకుంటున్నారు. ఆగస్టు 15న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. సాయంత్రం 19.29 (7 గంటల 29 నిమిషాల) నుంచి రిటైర్ అయినట్లు భావించాలని  కోరాడు. తాజాగా ఐపీఎల్‌లో సరిగ్గా 7 గంటల 30 నిమిషాలకు గ్రౌండ్ లోకి దిగి అభిమానులను అలరించాడు.

అయితే ప్రస్తుత సీజన్ లో చాలా జోష్ లో కనిపిస్తున్నాడు ధోనీ. అతని లుక్ కూడా మారిపోయింది. చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నాడు.  ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఐపీఎల్‌లో మాత్రమే ధోనీ ఆటను చూసే వీలుంది. మహీ కూడా పక్కాగా ఐపీఎల్ పై ఫోకస్ పెట్టడానికి వీలుంది. ప్రజంట్ ధోనీని చూస్తుంటే తుఫాన్ ముందు నిశ్శబ్దంలా ఉన్నాడు. బ్యాట్ పడితే ఊచకోత మొదలయ్యేలానే ఉంది. ఈ క్రమంలో ట్విట్టర్​ వేదికగా ‘ధోనీ ఈజ్​ బ్యాక్’​, ‘వెల్కమ్​ బ్యాక్​ మై డియర్​ తాలా’ వంటి హ్యాష్ ట్యాగ్స్ వైరలవుతున్నాయి. అయితే ఐపీఎల్ లో అయినా ధోని మరికొన్ని సీజన్స్ ఆడతాడా, లేదా ఈ సీజన్ తో గుడ్ బై చెబుతాడో చూడాలి.

Also Read : IPL 2020 : ముంబై ఇండియన్స్ వెర్సస్ చెన్నై సూపర్ కింగ్స్ లైవ్ అప్డేట్స్