ఆ 24 మంది భారతీయులను విడిచిపెట్టిన జిబ్రాల్టర్

సిరియాకు తరలిస్తున్న ఇరానియన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌లో పనిచేస్తూ పట్టుబడిన 24మంది భారతీయులను జిబ్రాల్టర్‌ విడిచిపెట్టింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ముడిచమురు నౌకను సిరియా తీసుకెళ్తుండగా, స్పెయిన్ తీరంలో బ్రిటిష్‌ మెరైన్‌ సాయంతో జిబ్రాల్టర్‌ అధికార వర్గాలు నెల రోజుల క్రితం పట్టుకున్నాయి. ఇందులో ఉన్న 24 మంది భారతీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని క్షేమంగా విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. […]

ఆ 24 మంది భారతీయులను విడిచిపెట్టిన జిబ్రాల్టర్
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 12:36 AM

సిరియాకు తరలిస్తున్న ఇరానియన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌లో పనిచేస్తూ పట్టుబడిన 24మంది భారతీయులను జిబ్రాల్టర్‌ విడిచిపెట్టింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ముడిచమురు నౌకను సిరియా తీసుకెళ్తుండగా, స్పెయిన్ తీరంలో బ్రిటిష్‌ మెరైన్‌ సాయంతో జిబ్రాల్టర్‌ అధికార వర్గాలు నెల రోజుల క్రితం పట్టుకున్నాయి. ఇందులో ఉన్న 24 మంది భారతీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని క్షేమంగా విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా, ఇరాన్ ట్యాంకర్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అమెరికా కూడా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిబ్రాల్టర్ పోలీసులు ఈ నౌకను విడిచిపెట్టడం గమనార్హం.