Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

ఇదేనా దేశభక్తి..? పింగళి వెంకయ్యకు “భారతరత్న” ఎందుకు ఇవ్వడం లేదు?

Bharat Ratna for Pingali Venkayya demanded in Vijayawada, ఇదేనా దేశభక్తి..?  పింగళి వెంకయ్యకు “భారతరత్న” ఎందుకు ఇవ్వడం లేదు?

పింగళి వెంకయ్య.. తెలుగువారిని గర్వపడేలా చేసిన మహనీయుడు. జాతి గౌరవాన్ని తలెత్తుకుని నిలిపేలా.. ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవడం.. జయంతి ,వర్దంతి వంటి కార్యక్రమాల్లో స్మరించుకోవడం తప్ప.. ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది.
పింగళికి దక్కిన గుర్తింపు ఎంత అంటే.. స్వయంగా భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా ఆయన పేరు కనిపించదు. పైగా 1921 సంవత్సరంలో ఓ ఆంధ్రా యువకుడు జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీకి చూపించారని మాత్రం పేర్కొన్నారు. దీన్ని బట్టి మన ప్రభుత్వాలు.. ఓ గొప్ప దేశభక్తుడి పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి 1921లో జాతిపతి మహాత్మా గాంధీ సూచన మేరకు బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశంలో పింగళి.. త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీకి ఇచ్చారు. ఒకే జెండాతో బ్రిటీష్ వారికి నిద్రపట్టకుండా చేశారు. అటువంటి జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి భారతీయుడు.. రొమ్ము గుద్దుకుని చెప్పగల ధైర్యాన్నిచ్చిన జెండా మన జాతీయ జెండా. మన దేశభక్తిని చాటి చెప్పేది మన జెండా. అలాంటి జెండా రూపశిల్పికి ఇచ్చిన గౌరవం ఏమీ లేదు. ఏదో ఇచ్చామన్న పేరుకు పద్మ అవార్డును ప్రకటించి చేతులు దులుపుకున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం పింగళి పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఆ తర్వాత 2011లో ఏపీ ప్రభుత్వం పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఓ తీర్మానం కూడా చేసింది. కానీ అది ఏమైందో ఇప్పటికీ ఎవరీకీ తెలియదు.

భారతరత్న పురస్కారం అనేది పలు రంగాల్లో సేవ చేసిన వారికి గుర్తింపుగా ఇస్తారు. 1954లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దీనిని స్ధాపించారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన వారిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మంది వరకు దీన్ని అందుకున్నారు. దీన్ని ప్రకటించే ముందు ఈ జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత దీన్ని ప్రకటిస్తారు. ఈ పురస్కారంతో దేశంలో 7వ స్ధాయి గౌరవం లభిస్తుంది. అంటే దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి మొదలు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తుల తర్వాత భారతరత్న పురస్కారం పొందినవారు తగిన గౌరవం లభిస్తుంది.

Bharat Ratna for Pingali Venkayya demanded in Vijayawada, ఇదేనా దేశభక్తి..?  పింగళి వెంకయ్యకు “భారతరత్న” ఎందుకు ఇవ్వడం లేదు?

భారతరత్న పురస్కారాన్ని 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి మాత్రేమే ఇచ్చేవారు. అయితే 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి “మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా” అనే పదాన్ని చేర్చడంతో అన్ని రంగాల వారికి దీన్ని ప్రదానం చేస్తున్నారు. అయితే మరణించినవారికి దీన్ని ప్రదానం చేసేవారు కాదు. అయితే 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. అలా పొందినవారిలో తొలి వ్యక్తి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఒకే ఒక్క సందర్భంలో ఈ పురస్కారాన్ని వెనక్కి తీసుకున్నారు. అది కూడా స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌కు ప్రకటించి.. కొన్ని సాంకేతిక కారణాలతో వెనక్కి తీసుకున్నారు.

ఇతర దేశస్తులకు సైతం భారతరత్నను ప్రదానం చేసిన దాఖలాలున్నాయి. వీరిలో ఖాన్ అబ్దుల్ గఫార్‌ ఖాన్, నెల్సన్ మండేలా, మథర్ తెరిస్సా ఉన్నారు. ఇటీవల కాలంలో క్రీడల్లో సచిన్‌ టెండూల్కర్‌కు కూడా భారతరత్నతో సత్కరించారు. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సైతం అది దక్కింది.
ఇంతమందికి ఈ పురస్కారం లభించినా.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని వణికించిన జెండా, జాతియోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన జెండా మన మూడు రంగుల జెండా. జమ్ము కశ్మీర్‌లో నిన్నమొన్నటి వరకు రెండు జెండాలు ఎగిరినా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రభుత్వ కార్యాలయాలపై రెపరెపలాడుతోంది మన జెండా. ప్రతి గుండెలో దేశభక్తిని నింపుతున్న త్రివర్ణ పతాక రూపశిల్పిని మర్చిపోవడం సహేతుకంగా అనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికైనా జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య సేవల్ని గుర్తించి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరముందనే వాదన బలపడుతోంది.