పాక్ వక్ర బుద్ధి.. ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో స్వరంగ మార్గాలు.. అప్రమత్తమైన భారత బలగాలు..

భారత సరిహద్దుల్లోకి చొరబడటానికి పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. అయితే పాక్ ప్రయత్నాలను భారత బాలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి.

పాక్ వక్ర బుద్ధి.. ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో స్వరంగ మార్గాలు.. అప్రమత్తమైన భారత బలగాలు..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 6:29 PM

భారత సరిహద్దుల్లోకి చొరబడటానికి పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. అయితే పాక్ ప్రయత్నాలను భారత బాలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. కాగా భారత్ లోకి చొరబడేందుకు నైపుణ్యంతో కూడిన ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో సొరంగాలను  ఏర్పాటు చేస్తుంది పాకిస్థాన్. ఈ విషయాన్ని బిఎస్ఎఫ్ జమ్మూ సరిహద్దు ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జమ్వాల్ బుధవారం తెలిపారు.

“కథువాలోని హిరానగర్ సెక్టార్లో ఐబి వెంట కనుగొనబడిన సొరంగం సుమారు 150 మీటర్ల పొడవు ఉందని, ఇంజనీరింగ్  టెక్నీక్స్ తో   ఈ సొరంగం నిర్మాణంజరిగిందని అన్నారు. ఇది ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపడానికి పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అని జామ్వాల్ అన్నారు. “మేము 9 నుండి 10 సొరంగాలను గుర్తించాము. గత కొన్ని నెలల్లో కథువా లో 2-3 సొరంగాలను గుర్తించాము. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి మేము అప్రమత్తంగా ఉన్నాము” అని ఆయన అన్నారు. యాంటీ టన్నెలింగ్ పార్టీ దీనిని గుర్తించిందన్నారు. జీరో లైన్ నుంచి సుమారు 90 మీటర్ల దూరంలో మన వైపున ఉన్న కంచె నుంచి 20 మీటర్ల దూరంలో దీనిని గుర్తించినట్లు  జమ్వాల్ తెలిపారు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

పాక్ భూభాగం నుంచి అంతర్జాతీయ సరిహద్దుల్లో 100 మీటర్ల సొరంగం, భారత గస్తీ దళాల సెర్చ్ లో బయటపడిన వైనం