ఢిల్లీ మెట్రో స్టేషన్లే టార్గెట్‍గా ఉగ్రదాడులు

భారత్- పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణ౦లో, దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి చేసిన కుట్రలను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ఢిల్లీలోని అనేక‌ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో పోలీసులతో పాటు ఆర్మీ కూడా అనేక‌ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులు మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తి౦చడ౦తో ఢిల్లీలోని అనేక మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. కన్నాట్ […]

ఢిల్లీ మెట్రో స్టేషన్లే టార్గెట్‍గా ఉగ్రదాడులు
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2019 | 2:54 PM

భారత్- పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణ౦లో, దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి చేసిన కుట్రలను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ఢిల్లీలోని అనేక‌ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో పోలీసులతో పాటు ఆర్మీ కూడా అనేక‌ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది.

ఉగ్రవాదులు మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తి౦చడ౦తో ఢిల్లీలోని అనేక మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సరోజ్ నగర్ మెట్రో స్టేషన్లలో భద్రతా బలగాలు అణువణువూ గాలిస్తున్నాయి. బాంబ్ స్వ్కాడ్స్‌ను కూడా రంగంలోకి దించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ, ముంబయి మెట్రో స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మెట్రో స్టేషన్లలో పారా మిలటరీ బలగాలతో పహారా కాస్తున్నారు.