యుద్ధానికి పాక్ ముహూర్తం పెట్టుకున్న నెలలోనే.. భారత్ చేతికి రాఫెల్

Defence Minister Rajnath Singh To Receive First Of The 36 Rafale Fighter Jets For IAF On Dussehra, యుద్ధానికి పాక్ ముహూర్తం పెట్టుకున్న నెలలోనే.. భారత్ చేతికి రాఫెల్

భారత అమ్ములపొదిలోకి మరో యుద్ధం విమానం చేరబోతోంది. అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్ అయిన రాఫేల్.. త్వరలో భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరనుంది. వచ్చేనెల అక్టోబరు 8న తొలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారికంగా భారత్‌కు అప్పగించనుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాఫేల్ జెట్ ఫైటర్‌ను అందుకోనున్నారు. అయిత అక్టోబర్ 8వ తేదీనే తీసుకోడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి. అదే రోజు భారత ఎయిర్ ఫోర్స్ డే అవుతోంది. అంతేకాదు.. విజయ దశమి దసర కూడా ఈ సారి అదే రోజు వస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబరు 8నే అధికారికంగా తీసుకోవాలని భావించామని అధికారులు తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుగా రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్, ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అయితే అక్టోబర్ 8న అధికారికంగా భారత్‌కు అప్పగించినా.. అవి ఇప్పట్లో మన దేశానికి చేరేలా లేవు. భారత పైలట్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత.. వాటిని వచ్చే ఏడాది మే 2020 వరకు భారత్‌కు చేరనున్నాయి. తొలి విడతగా మే2020 వరకు నాలుగు విమానాలు రానున్నాయి. ఆ తర్వాత విడతల వారిగా.. సెప్టెంబర్ 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత వాయుసేనలో చేరనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *