సీఏఏపై ఈయూ పార్లమెంట్‌లో రేపు చర్చ.. ఓటింగ్

వివాదాస్పద సీఏఏ అంశాన్ని యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ సమస్యగా.. పెద్ద బూచిగా చూపడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టంపై ఈయూ పార్లమెంటులో చర్చ జరగడానికి అనువుగా ఓ తుది సంయుక్త తీర్మానం సిద్డంగా ఉంది. బుధ, గురు వారాల్లో (రెండురోజులపాటు) చర్చ జరగనుంది. గురువారం దీనిపై చర్చతో బాటు ఓటింగ్ కూడా జరుగుతుంది. ఈయూ పార్లమెంటులోని 751 మంది ఎంపీల్లో 560 మంది తీర్మానాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సీఏఏ వివక్షాపూరితంగా ఉందని, ప్రమాదకర విఛ్చిన్న ధోరణులను ప్రతిబింబిస్తోందన్న […]

సీఏఏపై ఈయూ పార్లమెంట్‌లో రేపు చర్చ.. ఓటింగ్
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2020 | 12:36 PM

వివాదాస్పద సీఏఏ అంశాన్ని యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ సమస్యగా.. పెద్ద బూచిగా చూపడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టంపై ఈయూ పార్లమెంటులో చర్చ జరగడానికి అనువుగా ఓ తుది సంయుక్త తీర్మానం సిద్డంగా ఉంది. బుధ, గురు వారాల్లో (రెండురోజులపాటు) చర్చ జరగనుంది. గురువారం దీనిపై చర్చతో బాటు ఓటింగ్ కూడా జరుగుతుంది. ఈయూ పార్లమెంటులోని 751 మంది ఎంపీల్లో 560 మంది తీర్మానాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సీఏఏ వివక్షాపూరితంగా ఉందని, ప్రమాదకర విఛ్చిన్న ధోరణులను ప్రతిబింబిస్తోందన్న ఆరోపణలతో కూడిన ఈ సంయుక్త తీర్మానంపై గురువారం మధ్యాహ్నం ఓటింగ్ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపీల్లో 5 వేర్వేరు గ్రూపులకు చెందినసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  ఈ చట్టం నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రజల్లోని వివిధ వర్గాలతో శాంతియుత చర్చలు జరపాలని, వివాదాస్పద సవరణలను రద్దు చేయాలని ఇందులో కోరారు. భారత అంతర్జాతీయ ఒప్పందాలను ఈ చట్టం అతిక్రమించేదిగా ఉందని ఎంపీలు విమర్శించారు. నేషనలిజం (జాతీయవాదం) పెరుగుతున్నకొద్దీ మత పరమైన అసహనం కూడా పెరుగుతోందని, ముస్లిముల పట్ల వివక్షకు ఇది తావిస్తోందని ఈ తీర్మానంలో ఆరోపించారు.

అక్రమ శరణార్థులను గుర్తించేందుకు ఎన్నార్సీని అమలు పరచడం అన్నది పౌరసత్వం మంజూరులో ప్రమాదకరమైన మలుపు.. ఇది అతి పెద్ద సంక్షోభానికి దారి తీస్తుంది’ అని ఈ తీర్మానంలో హెచ్చరించారు. ఇండియాలో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జరిగిన ఆందోళనలను అదుపు చేసేందుకు భద్రతా దళాలను (పోలీసులను) వినియోగించడం, యూపీ వంటి రాష్ట్రాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై లాఠీఛార్జి  చేయడం, టార్చర్ పెట్టడం, ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించడంవంటివి మానవహక్కులు అతిక్రమించడమే అని ఆరోపించారు. అలాగే మానవ హక్కుల కార్యకర్తలను, మేధావులను అరెస్టు చేయడాన్ని ఎంపీలు ఖండించారు.