Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

మరో రెండు రోజుల్లో ప్రకాశ్ రాజ్‌ను చంపేస్తాం.. మరో 14 మందిని కూడా..

Death threat received by Prakash Raj.. Brinda Karat.. HD Kumaraswamy and 12 other public figures, మరో రెండు రోజుల్లో ప్రకాశ్ రాజ్‌ను చంపేస్తాం.. మరో 14 మందిని కూడా..

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయనతో పాటుగా మరో 14మందిని కూడా చంపేస్తామని బెంగళూరులోని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఓ లేఖ వచ్చింది. ప్రకాశ్ రాజ్‌తో పాటుగా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి, యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయకుడు మహేంద్రకుమార్‌, జర్నలిస్ట్‌ అగ్ని శ్రీధర్‌ పేర్లు కూడా ఉన్నాయి.
గతకొద్ది రోజులుగా సంఘ్‌ పరివార్‌ను విమర్శిస్తున్న నిజగుణానందస్వామికి ఈ బెదిరింపు లేఖ వచ్చింది. కన్నడలో రాసి ఉన్న ఆ లేఖలో.. ధర్మ ద్రోహులు, దేశద్రోహులను ఈ జనవరి 29న హతమార్చేందుకు ముహూర్తం పెట్టాంమంటూ పేర్కొన్నారు. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండని.. నిజగుణానందస్వామీని ఉద్దేశిస్తూ.. మీరే కాకుండా మీతో పాటు మరో పన్నెండు మంది కూడా వారి లాస్ట్ జర్నీకి ఇక రెడీగా ఉండండంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖను చూసి ఆందోళనకు గురైన ఆశ్రమవాసులు… లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి అందజేశారు. దీంతో పోలీసులు ఆశ్రమానికి అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందుకు ఆశ్రమ మఠాధిపతి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తనకూ బెదిరింపులు వచ్చాయంటూ కుమారస్వామి కూడా శనివారం వరుస ట్వీట్లు చేశారు.

Related Tags