తండ్రి పెళ్లి వద్దన్నందుకు.. ఆత్మహత్య చేసుకున్న యువతి

తండ్రి పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్లలోని చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన చేప్యాల కనకయ్య, కనకవ్వ దంపతుల మూడో కూతురు రేణుక (20) డిగ్రీ థర్డ్‌యిర్ చదువుతుంది. కూతుళ్ల పెళ్లి విషయంపై ఇంట్లో చర్చించుకుంటుండగా రేణుక తనకే ముందు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరింది. పెద్ద కూతురు వివాహం చేయకముందే నీ పెళ్లి ఎలా చేస్తామంటూ తండ్రి మందలించడంతో.. మనస్తాపం చెందిన రేణుక ఇంట్లో […]

తండ్రి పెళ్లి వద్దన్నందుకు.. ఆత్మహత్య చేసుకున్న యువతి
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 1:10 PM

తండ్రి పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్లలోని చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన చేప్యాల కనకయ్య, కనకవ్వ దంపతుల మూడో కూతురు రేణుక (20) డిగ్రీ థర్డ్‌యిర్ చదువుతుంది. కూతుళ్ల పెళ్లి విషయంపై ఇంట్లో చర్చించుకుంటుండగా రేణుక తనకే ముందు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరింది. పెద్ద కూతురు వివాహం చేయకముందే నీ పెళ్లి ఎలా చేస్తామంటూ తండ్రి మందలించడంతో.. మనస్తాపం చెందిన రేణుక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి రేణుక పూర్తిగా కాలిపోయి మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు.