ఎయిర్‌పోర్టులో 150 కిలోల బంగారం…సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

గత కొంతకాలంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం,డ్రగ్స్ భారీగా పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా భారీ ఎత్తున 150 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. విమానాశ్రయంలో గలం కార్గోలో తనిఖీలు చేస్తుండగా భారీ ఎత్తున పుత్తడిని గుర్తించారు. ఇది మలేషియా నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టుగా గుర్తించారు అధికారులు. అయితే గత కొంతకాలంగా ఆర్బీఐ అనుమతిలేని కొన్ని సంస్ధలు సింగపూర్, మలేషియా వంటి దేశాలనుంచి భారీ ఎత్తున బంగారాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నాయని కస్టమ్స్ అధికారులకు సమాచారం […]

ఎయిర్‌పోర్టులో 150 కిలోల బంగారం...సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 1:25 PM

గత కొంతకాలంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం,డ్రగ్స్ భారీగా పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా భారీ ఎత్తున 150 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. విమానాశ్రయంలో గలం కార్గోలో తనిఖీలు చేస్తుండగా భారీ ఎత్తున పుత్తడిని గుర్తించారు. ఇది మలేషియా నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టుగా గుర్తించారు అధికారులు. అయితే గత కొంతకాలంగా ఆర్బీఐ అనుమతిలేని కొన్ని సంస్ధలు సింగపూర్, మలేషియా వంటి దేశాలనుంచి భారీ ఎత్తున బంగారాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నాయని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయా దేశాలనుంచి వచ్చే పార్శిళ్లను జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లోనే 150 కిలోల బంగారాన్ని గుర్తించారు.

ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకురావడం వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మధ్యవర్తి దీన్ని తీసుకువచ్చినట్టుగా గుర్తించారు. అయితే దీని వెనుక కొంతమంది పెద్దల హస్తమున్నట్టు కూడా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన వారితోపాటు అహ్మదాబాద్ తదితరప్రాంతాలకు చెందిన వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.