సీఆర్పీఎఫ్‌‌ మరింత బలోపేతం

కశ్మీర్‌ లోయలో జవాన్ల భద్రత కోసం ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్‌ బస్సులను సమకూర్చనున్నట్లు సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్ తెలిపారు. అలాగే కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్‌ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘కశ్మీర్‌లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్‌ […]

సీఆర్పీఎఫ్‌‌ మరింత బలోపేతం
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 6:34 AM

కశ్మీర్‌ లోయలో జవాన్ల భద్రత కోసం ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్‌ బస్సులను సమకూర్చనున్నట్లు సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్ తెలిపారు. అలాగే కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్‌ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

‘‘కశ్మీర్‌లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’’అని భట్నాగర్‌ పేర్కొన్నారు. అలాగే జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లందరూ విమానాల్లో ప్రయాణించవచ్చని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. జవాన్లు విధుల్లో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, సెలవుపై వెళ్తున్నప్పుడు, విధుల్లో చేరడానికి వస్తున్నప్పుడు అవసరమైనప్పుడల్లా విమానాల్లో ప్రయాణించవచ్చని ఆ శాఖ వెల్లడించింది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. దీంతో వారికి రక్షణ మరింత రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో