Crime News: దుర్మార్గుడి దారుణం.. కట్నం తీసుకురాలేదని భార్యపైనే అత్యాచారం చేయించాడు.. ఆ తర్వాత

|

Apr 30, 2022 | 9:38 AM

Rajasthan man gets wife gang-raped by relatives: రాజస్థాన్ దారుణం చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదన్న కోపంతో.. భర్త అత్యంత దురాఘతానికి పాల్పడ్డాడు.

Crime News: దుర్మార్గుడి దారుణం.. కట్నం తీసుకురాలేదని భార్యపైనే అత్యాచారం చేయించాడు.. ఆ తర్వాత
Minor girl raped
Follow us on

Rajasthan man gets wife gang-raped by relatives: రాజస్థాన్ దారుణం చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదన్న కోపంతో.. భర్త అత్యంత దురాఘతానికి పాల్పడ్డాడు. ఇష్టంతో పెళ్లి చేసుకున్న భార్యపై బంధువులతో అత్యాచారం చేయించి.. దాని వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ భరత్‌పూర్‌లో తాజాగా వెలుగుచూసింది. భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి హర్యానాకు చెందిన మహిళను 2019లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వివాహం సందర్భంగా అత్తింటివారు అల్లుడికి ఇస్తానన్న రూ.1.5లక్షల కట్నం ఇవ్వలేదు. దీంతో అత్తింటివారు కట్నం కోసం కోడలిని తరచూ వేధిస్తుండే వారు. రోజు గొడవలు జరుగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో భార్య దగ్గరకు వెళ్లిన భర్త.. ఏవేవో మాయమాటలు చెప్పి మళ్లీ తన ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. ఆ తర్వాత తన సమీప బంధువులు ఇద్దరిని పిలిచారు. అనంతరం వారితో తన భార్యపైనే అత్యాచారం చేయించాడు. అత్యాచారం ఘటనను భర్తే తన ఫోన్లో రికార్డు చేశాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు తనకు కట్నం ఇవ్వలేకపోయారు.. కానీ ఇప్పుడు ఈ అశ్లీల వీడియోను యూట్యూబ్‌లో పెట్టి కట్నం డబ్బులు సంపాదిస్తానంటూ అశ్లీల వీడియోను తన భర్త యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.

నిందితుల వద్ద నుంచి తప్పించుకొని పుట్టింటికి వెళ్లిన బాధితురాలు భర్త దురాఘతంపై, అశ్లీల వీడియో చిత్రీకరణపై కుటుంబసభ్యులకు తెలిపింది. అనంతరం కుటుంబసభ్యులు, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భరత్‌పూర్‌లోని కమాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దౌలత్ సాహు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Heatwave: మాడు పగిలిపోద్ది.. ఆ ఐదు రాష్ట్రాలను హెచ్చరించిన IMD.. ఢిల్లీలో రికార్డు బద్దలు..

Punjab Violence: పాటియాలాలో హింస దురదృష్టకరం.. చర్యలు తీసుకుంటాం: సీఎం భగవంత్ మాన్