Vijayawada Crime News: బెజ‌వాడ‌లో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది…

|

Jun 06, 2021 | 4:11 PM

బెజవాడలో మాయలేడీ బాగోతం వెలుగు చూసింది. వ్యాపారులే లక్ష్యంగా చేసుకొని వలపు వల విసిరి డబ్బులు వసూలు చేస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో....

Vijayawada Crime News: బెజ‌వాడ‌లో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది...
Women Cheating
Follow us on

బెజవాడలో మాయలేడీ బాగోతం వెలుగు చూసింది. వ్యాపారులే లక్ష్యంగా చేసుకొని వలపు వల విసిరి డబ్బులు వసూలు చేస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న మహిళపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది.అమాయకులను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి డబ్బులు కొట్టేస్తున్నట్టుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యువకుడు త‌న నుండి స‌ద‌రు మ‌హిళ  80 లక్షలు కొట్టేసినట్టుగా పోలీసులకు మొరపెట్టుకున్నారు. వలపు వల విసురుతూ మోసాలకు పాల్పడుతున్న మహిళ శ్రీదివ్యతో పాటు ఆమె తమ్ముడు పోతురాజు ఆమెకు సహకరిస్తున్న రజాక్ పై బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ తరహాలోనే మోసపోయిన పలువురి నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహలో ఆ మహిళ మోసాలకు పాల్పడిన‌ విషయం ఫిర్యాదు అందినట్లుగా పోలీసులకు చెప్పారు. ప్రముఖ న్యాయవాది పేరును అడ్డం పెట్టుకుని ఈ మహిళ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన కార్పొరేటర్, హోటల్ యజమాని సహా పదుల సంఖ్యలో ఆమె బాధితులు ఉన్న‌ట్లు స‌మాచారం.

Also Read: మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. అక్క‌డ మాత్రం అలాగే జ‌రిగింది.. వ‌స్తువుల షాడోలు కూడా క‌నిపించ‌లేదు

పైనుంచి చూస్తే పుచ్చకాయ‌ల లోడులాగే ఉంది.. అడుగున చెక్ చేసి కంగుతిన్న పోలీసులు