Crime: కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉరి వేసుకుని..

|

Jun 02, 2021 | 6:25 PM

Daughter Rape Case: కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన

Crime: కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉరి వేసుకుని..
Hanging
Follow us on

Daughter Rape Case: కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన త్రిపుర నార్త్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి తన ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. అయితే అతని కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం 17 ఏళ్ల కన్నకూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం త్రిపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో తాజాగా మంగళవారం సదరు వ్యక్తి తన ఇంటికి కొద్ది దూరంలో చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. కాగా ఆ వ్యక్తి మృతిపై ప్రాథమిక విచారణ జరుగతుందని.. అది ఆత్మహత్యా.. లేక హత్య చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ భానుపద చక్రవర్తి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాస్తవానికి బాలికపై శుక్రవారం అత్యాచారం జరిగినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Doctor Assault: కోవిడ్ కేర్ సెంటర్‌లో యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్.. వీడియో

స్మోకింగ్ తో కోవిద్ కి లింక్ ! పొగ రాయుళ్లూ ! బీ అలర్ట్ అంటున్న మీరట్ డాక్టర్లు , ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ తో కూడా ముప్పే అంటూ హెచ్చరికలు