Double Murder Case: బిట్టు శ్రీను లింక్‌ ఎక్కడ ఉంది..? ఇప్పుడీ కోణంలో విచారణ మొదలు పెట్టిన స్పెషల్‌ టీమ్‌

|

Feb 20, 2021 | 10:42 PM

బిట్టు శ్రీను లింక్‌ ఎక్కడ ఉంది? అందరూ అనుమానిస్తున్నట్లు మేనమామ పుట్ట మధు కళ్లలో ఆనందం కోసమే వామన్‌రావు దంపతులను హత్య చేయించాడా? ఇప్పుడీ కోణంలో విచారణ మొదలైంది.

Double Murder Case: బిట్టు శ్రీను లింక్‌ ఎక్కడ ఉంది..? ఇప్పుడీ కోణంలో విచారణ మొదలు పెట్టిన స్పెషల్‌ టీమ్‌
Follow us on

Double Murder Case: బిట్టు శ్రీను లింక్‌ ఎక్కడ ఉంది? అందరూ అనుమానిస్తున్నట్లు మేనమామ పుట్ట మధు కళ్లలో ఆనందం కోసమే వామన్‌రావు దంపతులను హత్య చేయించాడా? ఇప్పుడీ కోణంలో విచారణ మొదలైంది. మంథని పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ వారితో సంబంధం లేకుండా… స్పెషల్‌ టీమ్‌ ఇన్విస్టిగేషన్‌ మొదలైంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన టీమ్‌ల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోంది. అందుకే ఏ ఒక్క చిన్న లింక్‌ను వదలకుండా విచారణ చేస్తున్నారు.

వామన్‌రావు దంపతుల హత్యపై తొలిసారిగా స్పందించారు పుట్ట మధు. మీడియా,కొన్ని పేపర్లు తనను టార్గెట్‌ చేశాయన్నారు. ఈ హత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నేను ఏ అక్రమాలు చేయలేదన్నారు. నిజాలు త్వరలోనే బయటపడతాయన్న ఆయన.. మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు.

జంట హత్యల వెనుక బిట్టు శ్రీను మాత్రమే ఉన్నాడా? అతడిని ఎవరైనా ప్రోత్సహించారా? ఇంకెవరైనా చేయించారా? అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. టీవీ9 ఇంటర్వ్యూలో కీలకమైన అంశాలను ప్రస్తావించారు రామగుండం సీపీ సత్యనారాయణ. పోలీసులపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూనే… విచారణ ఏ రకంగా జరుగుతోందో వివరించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..