కుషాయిగూడలో కుంగిన రోడ్డు..చూస్తుండగానే ఇలా..

వాహనాల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అక్కడున్న ప్రజలంతా చూస్తుండగానే రోడ్డు పై భాగం లోపలికి వెళ్లిపోయింది.

కుషాయిగూడలో కుంగిన రోడ్డు..చూస్తుండగానే ఇలా..

Updated on: Sep 16, 2020 | 6:22 PM

వాహనాల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అక్కడున్న ప్రజలంతా చూస్తుండగానే రోడ్డు పై భాగం లోపలికి వెళ్లిపోయింది. అద‌ృష్టవశాత్తు రోడ్డు కుంగిపోతున్న సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటు చేసుకుంది.

కుషాయిగూడలోని ఏ.ఎస్ రావు నగర్ లో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు జనం చూస్తుడగానే రోడ్డు లోపలికి కుంగిపోతూ పెద్ద గొయ్యి ఏర్పడింది. భారీ గొయ్యి ఏర్పడటంతో ట్రాఫిక్ అండ్ కుషాయిగూడ లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమతమయ్యారు. వాహన దారులు, ప్రయాణికులు ప్రమాదానికి గురి కాకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో వచ్చే పోయే వాహనాలను రూట్ మార్చి పంపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us