విజయవాడ(Vijayawada)లో దారుణం జరిగింది. ఇంట్లో పిల్లలతో కలిసి నిద్ర పోతున్న మహిళపై ఎదురింట్లో నివాసముండే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి నిందితుడి భార్య సహకరించడం గమనార్హం. అంతే కాకుండా బాధితురాలిపై తన భర్త అత్యాచారం చేస్తున్న వీడియోను భార్య రికార్డు చేసింది. అజిత్‌సింగ్‌నగర్ పరిసర ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తోంది. వీరి ఎదురింట్లో దిలీప్, తులసి అనే భార్యాభర్తలు ఉంటున్నారు.
ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో మహిళ ఇంట్లోకి వారు ప్రవేశించారు. బలవంతంగా తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై దిలీప్ రెండు సార్లు అత్యాచారం చేయగా, అతడి భార్య తులసి వీడియో తీసి ఫొటోలు తీసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ పిల్లలిద్దరినీ చంపేస్తానని బెదిరించారు. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని బెదిరిస్తుండడంతో బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులైన దంపతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read
Drugs: అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. తనిఖీల్లో భారీగా యాంఫెటమైన్ స్వాధీనం..
BharatPe: ఫోన్ పే లో వాటాలు అమ్మే ప్రయత్నాల్లో సహవ్యవస్థాపకుడు..
Ghani Song Launch : వరుణ్ తేజ్ గని సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్