మైక్రో ఫైనాన్స్ పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పంజా విసిరారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా మూడు చోట్ల దాడులు నిర్వహించారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్లో రెండు చోట్ల సోదాలు చేశారు. ప్రధానంగా ఢిల్లీలోని గురు గ్రామ్ కేంద్రంగా మైక్రోఫైనాన్స్ యాప్స్ నిర్వహిస్తున్నారు. కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారు.
ఢిల్లీలోని కాల్ సెంటర్లో ఏకంగా నాలుగు వందల మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా మూడు చోట్ల మైక్రో ఫైనాన్స్ apps కాల్ సెంటర్ ను గుర్తించారు. హైదరాబాద్‌లో రెండు కాల్ సెంటర్‌లలో 700 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివిధ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ కూపీ లాగుతున్నారు. ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న మైక్రోఫైనాన్స్ యాప్స్ వెనకాల చైనా కంపెనీలు ఉన్నట్లు వెల్లడవుతోంది. బేగంపేటలోని మైక్రోఫైనాన్స్ కంపెనీపై పోలీసుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని మరొక కాల్ సెంటర్‌లో కూడా సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలోని గుర్గావ్ కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచ్‌లు మెయింటెన్ చేస్తున్నారు తదితర విషయాలు తెలుసుకుంటున్నారు.
అలాగే బేగంపేట్ కాల్ సెంటర్ లో పోలీసుల సోదాలు ముగిసాయి. పిన్ ప్రింట్ టెక్నాలజీస్ పేరుతో బేగంపేటలో కాల్ సెంటర్ మైక్రో ఫైన్స్ అప్స్ నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్స్ కు చెందిన 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మేనేజర్ మధు, అసిస్టెంట్ మేనేజర్ మనోజ్, అడ్మిన్ మహేష్, ఓ మహిళ హెచ్ ఆర్ ని అరెస్ట్ చేసి సీసీఎస్‌కి తరలించారు. కాల్ సెంటర్ లోని హార్డ్ డిస్కులు, కస్టమర్ కి సంబంధించిన డేటాను స్వాధీనం చేసుకున్నారు.