Boy Bhargav Teja : మెల్లంపూడి గ్రామంలో విషాదం, శవమై కనిపించిన నిన్న మధ్యాహ్నం కిడ్నాపైన ఏడేళ్ల భార్గవ్‌తేజ

Boy Bhargav Teja murder :   అనుకున్నదే జరిగింది. ఆ తల్లికి పుత్రశోకమే మిగిలింది. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఏడేళ్ల..

Boy Bhargav Teja : మెల్లంపూడి గ్రామంలో విషాదం, శవమై కనిపించిన నిన్న మధ్యాహ్నం కిడ్నాపైన ఏడేళ్ల భార్గవ్‌తేజ
Bhargav Teja

Updated on: Mar 15, 2021 | 7:04 PM

Boy Bhargav Teja murder :   అనుకున్నదే జరిగింది. ఆ తల్లికి పుత్రశోకమే మిగిలింది. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఏడేళ్ల భార్గవ్‌తేజ …ఆచూకి కోసం వెదికిన తల్లిదండ్రులకు జీర్ణించుకోలేని నిజం కళ్లముందు కనిపించింది. ఒక్కసారిగా కుటుంబమేకాదు, మొత్తం గ్రామాన్నే కంటతడి పెట్టిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడి గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఏడేళ్ల భార్గవ్‌తేజ ఇప్పుడు శవమై కనిపించాడు. చిరు తిండి కొనుక్కునేందుకు వెళ్లిన భార్గవ్‌తేజ మృతదేహాన్ని ఇంటి సమీపంలోనే గుర్తించారు. పసివాడ్ని చంపిన కిరాతకులు పక్కనే ఉన్న పొదల్లో పడేసి వెళ్లారు. భార్గవ్‌తేజ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. వారిని ఆపడం ఎవరితరం కానంతగా దుఖిస్తున్నారు. ఇది ఎవరి పని, ఎందుకు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read also :

Kamal Haasan Nomination Pics : కోయంబత్తూర్ సౌత్​అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్