
మనుషుల్లో మృగ లక్షణాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అందులోనా చిన్న పిల్లలపై కూడా కొంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు. బాగా చదువుకున్న వారు, మంచి ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవమర్యాదలు పొందుతున్న వారు కూడా విచక్షణ మరిచి మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వారి కామ దాహానికి పాపం పసిపిల్లలు సైతం బలవుతున్నారు. తాజాగా ఇంట్లో ఒంటిరిగా ఉన్న ఓ మైనర్‌పై కూడా అలాంటి దారుణమై జరిగింది. పక్కింట్లోనే ఉండే ఓ 47 ఏళ్ల వ్యక్తి ఈ నీచానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లో వెళ్తే..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఒక మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె పక్కింట్లో ఉండే వ్యక్తి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దారుణం జరిగిన రెండు రోజుల వరకు కూడా భయంతో ఆ బాలిక నోరు విప్పలేదు. ఆమె నోరు తెరిచి, తనపై జరిగిన లైంగిక దాడి గురించి కుటుంబ సభ్యులతో చెప్పుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడైన 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జూలై 20న ఘటన జరగ్గా రెండు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందింది.
అమర్దా రోడ్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం.. కరుణాకర్ బెహెరాగా గుర్తించబడిన నిందితుడు మైనర్ బాలిక ఇంట్లోకి ఆమె కుటుంబం సభ్యులు లేని సమయంలో ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ సంఘటనతో కుంగిపోయిన ఆ బాలిక, రెండు రోజులు మౌనంగా ఉండి, తన కుటుంబ సభ్యులతో జరిగిన విషయం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బెహెరాను అరెస్టు చేసి ప్రస్తుతం విచారణ కోసం పోలీసు కస్టడీలో ఉంచారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి