Murder Mystery: పోలీసులకే సవాల్ విసురుతున్న గోనె సంచి శవం.. ఇంతకీ ఎవరిది..?

ఒక శవం .. వంద అనుమానాలు.. రోజలు గడుస్తున్నా గోనె సంచిలో డెడ్‌ బాడీ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. రాచకొండ పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌ సవాల్‌గా మారింది. ఎన్నో సంచలన కేసులను చాకచక్యంగా చేధించారు సరే. ఈ కేసులో ఇంత వరకు ఎలాంటి పురోగతి ఎందుకు లేదు? ఈ కేసులో ఆలస్యం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు మరకలా మారుతోంది.

Murder Mystery: పోలీసులకే సవాల్ విసురుతున్న గోనె సంచి శవం.. ఇంతకీ ఎవరిది..?
Crime News

Updated on: Jan 23, 2024 | 8:02 PM

ఒక శవం .. వంద అనుమానాలు..  రోజలు గడుస్తున్నా గోనె సంచిలో డెడ్‌ బాడీ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. రాచకొండ పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌   సవాల్‌గా మారింది. ఎన్నో సంచలన కేసులను చాకచక్యంగా చేధించారు సరే. ఈ కేసులో ఇంత వరకు ఎలాంటి పురోగతి ఎందుకు లేదు? ఈ కేసులో ఆలస్యం  పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు మరకలా మారుతోంది. చంపింది ఎవరు? ఎందుకు? అనేది తరువాత సంగతి.. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరో ఇంత వరకు చిన్న క్లూ లేదంటే.. హీరో నెంబర్‌ 1 పోలీసింగ్‌ ఏమైనట్టు? అన్నదీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎక్కడో చంపడం.. శవాన్ని గోనె సంచిలో కుక్కి చెత్తకుప్పల్లోనోనో.. శివారులో పడేయడం.. ఇదే ఇప్పుడు ఖాకీలకు సవాల్‌ విసురుతోన్న వరుస ఘటనలు. తాజాగా రాచకొండ పోలీసులకు సవాల్‌గా మారిన అన్‌నోన్‌ డెడ్‌బాడీ. ఔటర్‌ రింగ్‌ రిండ్‌ సర్వీస్‌ రోడ్డు పక్కన గోనే సంచిలో శవం కనిపించింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ ఇంతవరకు శవం ఎవరిదన్న జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు.
అదీ జనవరి 16న పరిస్థితి. శవం కనిపించింది 16వ తేదిన. అప్పటికే డెడ్‌ పూర్తిగా కుళ్లిపోయివుంది. అంటే అంతకు వారం పది రోజులు ముందు హత్య జరిగి వుండొచ్చని భావించారు పోలీసులు. స్పాట్‌లో క్లూస్‌ టీమ్స్‌తో క్షుణ్ణంగా గాలించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. కానీ రోజులు గడుస్తున్నా చిన్న క్లూ లేదు. చనిపోయిన వ్యక్తి వయసు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని ఓ అంచనాకు వచ్చారు. అతనిది ముమ్మాటికీ హత్యేనని నిర్దారణకు వచ్చారు. అతన్ని ఎవరు ఎందుకు హత్య చేశారన్నదీ తరువాత సంగతి. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ఇప్పటికీ  తేలలేదు.
గత వారం రోజలుగా టెక్నికల్‌ టీమ్స్‌.. వీడియో సర్వలెన్స్ ఎనాలసీస్ వింగ్, రోడ్డు ట్రాన్స్ పోర్టు అథారిటీ ఇలా అన్ని టీమ్స్ సమన్వయంతో ఈ కేసుపై ఫుల్‌గా  ఫోకస్‌ పెట్టారు. సర్వీస్ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించినా సరే ఇంకా క్లారిటీ  రాలేదు. ఎక్కడో హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కుక్కి ఔటర్‌  రింగ్‌ రోడ్‌ పై నుంచి కింద పడేసి వుంటారని ఓ నిర్దారణకు వచ్చారు పోలీసులు. గోల్డ్‌ రింగ్స్‌, మెడలో చైన్‌ అలానే ఉండడంతో.. తెలిసిన వాళ్లే అతన్ని హత్య చేసి వుంటారని భావిస్తున్నారు పోలీసులు.
జనవరి పదవ తేది నుంచి 16వ తేదీ వరకు ఈ రూట్‌లో వెళ్లిన వాహనాలపై  దృష్టి సారించారు. ఇప్పటి వరకు 40 వేలకు పైగా వాహనాల స్పీడ్‌ అనాలసిస్‌ చేశారు. మరోవైపు మిస్సింగ్‌ కేసుల వివరాలను సేకరించారు. కానీ ట్యాలీ కాకపోవడం, చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. స్పాట్‌లో దొరికిన ఆనవాళ్లు.. మృతదేహంపై వున్న నగలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఎన్నో సంచలన కేసులను చాకచక్యంగా చేధించారు రాచకొండ పోలీసులు. కానీ ఈ  కేసులో మాత్రం ఇప్పటికింకా ఎలాంటి పురోగతి లేదు. అయితే శవం ఎవరిదన్న దానిపై క్లారిటీ వస్తే, అసలు మిస్టరీ వీడే అవకాశముంది..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…