Crime News: కన్న తండ్రి అమానుషం.. బాలికపై అత్యాచారం.. అది తెలిసి సోదరుడు..

Minor Girl: కంటికి రెప్పలా చూసుకునే కన్న తండ్రే బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. మృగాడిలా ప్రవర్తిస్తూ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రి చేస్తున్న

Crime News: కన్న తండ్రి అమానుషం.. బాలికపై అత్యాచారం.. అది తెలిసి సోదరుడు..
crime news

Updated on: Sep 06, 2021 | 8:07 AM

Minor Girl: కంటికి రెప్పలా చూసుకునే కన్న తండ్రే బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. మృగాడిలా ప్రవర్తిస్తూ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రి చేస్తున్న అరాచకాలను తెలుసుకున్న కొడుకు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాలిక అన్న ఆత్మహత్య చేసుకున్నాడని జలోర్‌ జిల్లా పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో.. విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

తండ్రి తనను రోజూ వేధిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాలిక తన అత్తకు మొత్తం సంఘటనను వివరించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి 32 నిమిషాల ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో.. అది విన్న బాలిక సోదరుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక సోదరుడు సాంచోర్ ప్రాంతంలోని నర్మద కాలువలో దూకి మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు.ఆడియో క్లిప్ శనివారం వెలుగులోకి రావడంతో దర్యాప్తు ప్రారంభించామని.. అదే రోజు బాలిక సోదరుడు మరణించినట్లు వెల్లడించారు. ఈ సంఘటన బయటకు రావడంతో బాలిక తండ్రి తన ఇంటి నుంచి పారిపోయాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.

ఆడియో క్లిప్‌లో.. బాలిక తన అత్తతో మాట్లాడుతూ.. తన తండ్రి ఆమెకు మొబైల్ ఫోన్ కొంటాననే నెపంతో తన కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ రోజు తన సోదరుడిని వెంట తీసుకెళ్లమని ఆమె తల్లి భర్తకు చెప్పగా.. అతను నిరాకరించాడని చెప్పింది. నిత్యం తన తండ్రి లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పినప్పుడు.. ఆమె మందలించిందని ఆమె తన అత్తతో ఆడియో క్లిప్‌లో చెప్పిందని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: అమ్మా ఉద్యోగంతో తిరిగొస్తాం.. ఇవే చివరి మాటలయ్యాయి.. తీరా ఆ ఐదుగురు స్నేహితులు..

TS Crime News: తప్పిన భారీ ప్రమాదం.. ప్రజ్ఞాపూర్‌లో ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ.. 20 మందికి..

Loading...
Unable to load recommendations.
Follow Us