Man sexually assaults employee: సాటి మహిళా ఉద్యోగిపై కీచకుడు కన్నేశాడు. ఆ తర్వాత ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం ఆమెకు ఆ వీడియో చూపించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడు. తరచూ వేధింపులకు పాల్పడుతుండటంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో చోటుచేసుకుంది.
గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 52లో ఉన్న ఓ ల్యాబ్‌లో ఓ యువతి (26) టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ల్యాబ్‌లో పని చేసేప్పుడు యూనిఫార్మ్ వేసుకోవాల్సి ఉంటుంది. కావున ల్యాబ్‌కు ఆ యువతి ఓ రోజు డ్రెస్ మార్చుకుంటుండగా.. ఆమెతో పాటు పని చేసిన సచిన్ సింగ్ తివారీ అనే యువకుడు వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను యువతికి చూపించి వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి అతడి వద్దకు పిలుపించుకుని.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తాజాగా మంగళవారం మాట్లాడతం అంటూ.. ఆ యువతిని తన స్వగ్రామం వాజిరబాకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే కారులోకి ఎక్కించుకుని బాద్షాపూర్ వైపుకు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి బలాత్కారం చేయబోగా యువతి అడ్డగించింది. అయితే కత్తితో భయపెట్టి కారులోనే బలాత్కారం చేస్తుండడంతో యువతి కేకేలు వేసింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపే కీచకుడు పరారయ్యాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు అతను చేసిన దారుణాలను వివరించింది. గతంలో అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు వాపోయింది. గర్భం దాలిస్తే అబార్షన్ చేయించినట్లు తెలిపింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
Also Read: