Corona Masks: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ప్రబుద్ధులు.. వాడి పడేసిన మాస్కులను దేనికి ఉపయోగిస్తున్నారో చూడండి..

|

Apr 12, 2021 | 7:29 PM

Corona Masks Used For: వ్యాపారం ఏదైనా లాభమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కొందరు స్వార్థపు వ్యాపారులు. ఇందుకు ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కాదేదీ మోసానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో...

Corona Masks: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ప్రబుద్ధులు.. వాడి పడేసిన మాస్కులను దేనికి ఉపయోగిస్తున్నారో చూడండి..
Used Masks
Follow us on

Corona Masks Used For: వ్యాపారం ఏదైనా లాభమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కొందరు స్వార్థపు వ్యాపారులు. ఇందుకు ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కాదేదీ మోసానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ సంఘటనను చూస్తే ఇది పీక్స్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. కరోనా కష్ట కాలాన్ని కూడా తమ స్వార్థ ఆలోచనకు వాడుకుంటున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఇంతకీ విషయమేంటంటే.. కరోనా సమయంలో మాస్కుల వినియోగం తప్పనిసరిగా మారింది. చాలా మంది వస్త్రంతో చేసిన మాస్కుల కంటే వాడి పడేసే మాస్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బయట తిరిగే వారు మాస్కులను ఇంటికి ఎందుకు తీసుకెళ్లడమనే ఉద్దేశంతో వీటిని ఉపయోగిస్తున్నారు. ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ మాస్కులను దగ్గరల్లో ఉన్న చెత్త కుప్పల్లోనే మరో చోట పడేసి వెళుతుంటారు.  ఇలాంటి వాడి పడేసిన మాస్కులనే తమ అక్రమ దందాదకు వాడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. మహారాష్ట్రలోని జల్గావ్‌ పట్టణంలో ఓ ఫ్యాక్టరీలో కొందరు పరుపులు తయారు చేస్తున్నారు. పరుపుల్లో దూదిని ఉపయోగించకుండా.. వాడిపడేసిన మాస్క్‌లను వినియోగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఫ్యాక్టరీకి చేరుకొని వారి గుట్టురట్టు చేశారు. పెద్ద మొత్తంలో వాడి పడేసిన మాస్క్‌లు ఉన్నట్లు గుర్తించారు. మాస్కులన్నింటినీ తగులబెట్టి…ఫ్యాక్టరీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్యాక్టరీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరీపై కేసు నమోదు చేశారు. ఈ నేరంలో భాగస్వామ్యమైన మిగతా వారిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. చూశారుగా.. వాడి పడేసిన మాస్కులు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయో కాబట్టి మాస్కులను విసిరేసే ముందు ఓసారి ఆలోచిస్తే మంచిది.

Masks

Also Read: Super Star Rajinikanth: షూటింగ్ లో బిజీగా సూపర్ స్టార్.. మాస్ లుక్ అదరగొడుతున్న రజినీకాంత్..

Nayanthara: విఘ్నేష్‌ శివన్‌తో కలిసి కొచ్చిన్‌కు నయన్.. తగ్గేదే లేదు.. స్పెషల్ ఫ్లైట్ ఉండాల్సిందే..

Prince Philip death: ముగిసిన బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు.. హాజరైన మనవడు హ్యారీ