Lovers Suicide by Hanging : వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న వయస్సులోనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోన్కల్ గ్రామానికి చెందిన హరీష్ (20), అదే గ్రామానికి చెందిన నిక్షిత(18) గత కొన్నెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి ఇంట్లో వారి ప్రేమను ఒప్పుకోరని భావించారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రేమ జంట బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కాగా.. ఆత్మహత్యకు ముందు మృతుడు హరీష్ తన వాట్సాప్ స్టేటస్‌లో ఓ మెస్సెజ్‌ను సైతం పెట్టాడు. ‘ఇద్దరం కలిసి బతకాలనుకున్నాం.. బతకాలంటే విడిపోవాలి.. వేర్వేరుగా ఉండలేనందున మేము చావాలని నిర్ణయించుకుంటున్నాం’అని హరీష్ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అలాగే తమ మృతికి యువతి అమ్మ, బావ కారణం అని వాట్సాప్ స్టేటస్‌లో పేర్కొన్నాడు. ఈ స్టేటస్ చూసిన స్నేహితులు, బంధువులు పలుచోట్ల వెతికారు. అతని జాడ ఎక్కడా లేకపోవడంతో నిశిత ఇంటికెళ్లగా తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా ఇద్దరు దూలానికి వేలాడుతూ కనిపించారు. సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. డిగ్రీ చదువుతున్న హరీష్, ఇటీవలే ఇంటర్ పూర్తయిన నిశిత ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Also Read: