Crime News: ‘అమ్మా’నుషం.. ఏడుస్తుందని పసికందును దారుణంగా.. అసలేమైందంటే..?

Kerala woman kills baby: నెల రోజులు కూడా నిండని పసికందును నవమాసాలు మోసి కన్న తల్లే దారుణంగా చంపింది. బిడ్డ తలను గోడకు కొట్టి ప్రాణాలు తీసింది. ఈ అమానుష ఘటన

Crime News: ‘అమ్మా’నుషం.. ఏడుస్తుందని పసికందును దారుణంగా.. అసలేమైందంటే..?

Updated on: Dec 14, 2021 | 5:31 PM

Kerala woman kills baby: నెల రోజులు కూడా నిండని పసికందును నవమాసాలు మోసి కన్న తల్లే దారుణంగా చంపింది. బిడ్డ తలను గోడకు కొట్టి ప్రాణాలు తీసింది. ఈ అమానుష ఘటన కేరళలోని పతనంతిట్టలో చోటుచేసుకుంది. 27 రోజుల పసికందు తలను గోడకు కొట్టి చంపిన ఘటనలో తల్లిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నెల కూడా నిండని శిశువు క్రమం తప్పకుండా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శిశువు ఎడతెగని ఏడుపు 21 ఏళ్ల తల్లిని నేరం చేయడానికి ప్రేరేపించిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన డిసెంబరు 9న జరిగిందన్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులు సూచించిన మందులతో మహిళ ఇంటికి తిరిగొచ్చింది. ఆ తరువాత శిశువు పరిస్థితి మరింత దిగజారింది. అయితే.. హుటాహుటిన శిశువును తాలూకా ఆసుపత్రికి తరలించగా, అక్కడ శిశువు మరణించింది.

ఆ తర్వాత తండ్రి జోజీ థామస్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. శిశువు పోస్ట్‌మార్టంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పిల్లవాడి తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని వైద్యులు కనుగొన్నారు. వెంటనే వైద్యాధిధికారి పిల్లల తల్లిదండ్రులను కలుసుకుని ప్రశ్నించగా.. మహిళ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మహిళ.. ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడి చంపిందని తెలిపారు. మహిళ ఆశ్రమంలో ఆ వ్యక్తితో కలిసి జీవిస్తుందని పోలీసులు తెలిపారు. పసికందు తండ్రికి అప్పటికే పెళ్లయిందని, మహిళ అతనితో కలిసి జీవిస్తోందని తెలిపారు. తదుపరి విచారణలో బిడ్డను తల్లే హత్య చేసిందని తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొట్టాయంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న మహిళ తన ప్రేమికుడితో ఫోన్‌లో మాట్లాడి.. అనారోగ్యంతో ఉన్న పసికందును చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Lakhimpur Kheri Case: పక్కా ప్రణాళికతోనే ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న.. కేంద్రమంత్రి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు

Crime News: బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు యత్నించిన భర్త.. భార్య చేసిన పనికి చావుబతుకుల్లో భర్త!