Kerala: దిగాలుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అమ్మాయి, అబ్బాయి.. చేతిలో నల్లటి కవర్‌.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. లివింగ్‌లో ఉండి సహజీవనం చేస్తున్న ఓ ప్రేమ జంట తమకు పుట్టిన ఇద్దరు శిశువులను చంపి మట్టిలో పూడ్చిపెట్టారు. కొన్నేళ్ల తర్వాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి రద్యాప్తు చేపట్టారు.

Kerala: దిగాలుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అమ్మాయి, అబ్బాయి.. చేతిలో నల్లటి కవర్‌.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా
Kerala Case

Updated on: Jun 30, 2025 | 11:23 AM

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. లివింగ్‌లో ఉండి సహజీవనం చేస్తున్న ఓ ప్రేమ జంట తమకు పుట్టిన ఇద్దరు శిశువులను పుట్టిన వెంటనే చంపి మట్టిలో పూడ్చిపెట్టారు. కొన్నేళ్ల తర్వాత వాళ్ల అవశేషాలను తీసుకొని వెళ్లి పీఎస్‌లో లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాళ ప్రారం.. ఆదివారం 25 ఏళ్ల భవిన్, 22 ఏళ్ల అనీషా అనే యువతి పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే, వాళ్లు తీసుకొచ్చిన ఓ నల్ల కవర్‌ను పోలీసులుకు అందించారు. అందులో ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలు ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) కలిసి తమకు పుట్టిన పిల్లలను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టినట్లు నేరాన్ని అంగీకరించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

కాగా సహజీవనం చేస్తున్న ఇద్దరికి 2020లో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు లివిన్‌ రిలేషన్‌ స్టార్ట్‌ చేశారు. అప్పుడు బవిష్ కు 20 ఏళ్లు, అనీషాకు 18 ఏళ్లు. భవిన్ ప్లంబర్‌గా పనిచేస్తుండగా, అనిషా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేది. అయితే కొన్ని రోజుల సహజీవనం తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వాళ్లు అనుకున్నది జరగలేదు.. కానీ అంతలోనే 2021లో అనిషా తన ఇంట్లోనే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక ఆ బిడ్డ గొంతుకోసి హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని తన ఇంటి దగ్గర్లోని ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టింది. కానీ ప్రియుడికి మాత్రం ప్రసవం టైంలో బొడ్డు బిడ్డగొంతుకు చుట్టుకోవడంతో చనిపోయినట్టు తెలిపింది.

అయితే, ప్రియుడు భవిన్ కోరిక మేరకు, ఎనిమిది నెలల తర్వాత, ఆమె బిడ్డ అవశేషాలను అతనికి అప్పగించింది. దీంతో భవిష్ ఆ శిశువు అవశేషాలను తమ బంధానికి గుర్తుగా ఉంచుకున్నాడు. అయితే 2024 ఆగస్టులో అనీషా తమ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినవెంటనే బిడ్డ ఏడవడంతో శబ్ధం బయటకు వినపడకుండా గట్టిగా నోరు మూసిందని.. దాంతో బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బిడ్డను కూడా ఆమె మొదట పెట్టిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో పాతిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసి భవిష్ ఇద్దరు పిల్లల అవశేషాలను తీసుకొని ప్రియురాలితో సహా పోలీస్‌ స్టేషన్‌ వెళ్లాడు. తాము చేసిన నేరాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కాగా ఫోరెన్సిక్ సర్జన్లు ఎముకలను పరిశీలించగా అవి మానవులవేనని తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

కాగా అనీషాతో తనకున్న ఉన్న సంబంధాలు దెబ్బతినడంతోనే భవిష్ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అనీషాకు వివాహేతర సంబంధం ఉందని బవిష్ అనుమానించాడని, ఈ విషయంపై గత నెలలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆమె తనను కాకుండా మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని.. ఎలాగైనా ఆమెపై ప్రతీకరాం తీర్చుకోవాలనే భవిష్‌ పిల్లల అవశేషాలను పోలీసులకు అప్పగించి నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.