Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. స్థానిక వార్తా సంస్థ ద్వారా అందిన సమాచారం ప్రకారం, అనంతనాగ్ జిల్లా(Anantnag District)లోని సిర్హామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఇక్కడ పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్(Search Operation) నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఘన విజయం సాధించాయి. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు. మరోవైపు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అనంతనాగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఇది కాకుండా, కుల్గామ్‌లో కూడా ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. కుల్గామ్‌లోని ధిపోరా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’కు చెందిన స్థానిక ఉగ్రవాది హతమయ్యాడు. మరోవైపు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అనంత్‌నాగ్‌లో లష్కర్ ఉగ్రవాదులు, కుల్గామ్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదులు చిక్కుకున్నారని, కుల్గామ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో జైషే ఉగ్రవాదులు చుట్టుముట్టారని ఐజీపీ కశ్మీర్ తెలిపారు.
షోపియాన్‌లో ఎన్‌కౌంటర్
ఇదిలావుంటే, జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్‌లోని హరిపోరా గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని అధికారి తెలిపారు. అటు, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వాతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
ఉగ్రవాదుల గుర్తింపు
ఉగ్రవాదులను అన్సార్ గజ్వాతుల్ హింద్‌కు చెందిన సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా, లష్కర్‌కు చెందిన ఉమర్ తేలీ అలియాస్ తల్హాగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌లోని ఖోన్‌మో ప్రాంతంలో సర్పంచ్ హత్యతో పాటు పలు ఉగ్రవాద కేసుల్లో వీరిద్దరూ వాంటెడ్‌గా ఉన్నారని చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులు ఇటీవల త్రాల్‌లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Read Also… AP CM YS Jagan: వెంట్రుక కూడా పీకలేరు అన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం దాగి ఉందా?