హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భగీరథ ప్రాజెక్ట్‌ పరికరాలు ఉంచిన గదిలో మంటలు అంటుకుని ప్రమాదం జరిగింది.

హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Updated on: Oct 09, 2020 | 6:58 AM

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భగీరథ ప్రాజెక్ట్‌ పరికరాలు ఉంచిన గదిలో మంటలు అంటుకుని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రాంతానికి వెళ్లి మంటలను ఆర్పుతున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాజెక్ట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us