Andhra Pradesh: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. చివరకు

|

Aug 19, 2022 | 6:53 AM

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఆమె దారుణానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న మొగుడ్ని చంపేసింది. చివరకి పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యింది. ఏలూరు..

Andhra Pradesh: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. చివరకు
Murder
Follow us on

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఆమె దారుణానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న మొగుడ్ని చంపేసింది. చివరకి పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యింది. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వసంతవాడ గ్రామానికి చెందిన వీర్రాజుకు అగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన శ్రావణితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరిద్దరికీ ప్రస్తుతం 7 నెలల కుమారుడు ఉన్నాడు. కాగా.. శ్రావణికి వివహానికి ముందే ఈదులగూడెం గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. అతనిని కలిసేందుకు శ్రావణి నిత్యం స్వగ్రామానికి వెళ్తుండేది. అంతే కాకుండా ఆ యువకుడు కూడా తరచూ శ్రావణి ఇంటికి వెళ్తుండేవాడు. ఇంటికి వెళ్లిన ప్రతిసారి శ్రావణి భర్త వీర్రాజుకు మద్యం తాగించేవాడు. దీంతో వీరిద్దరి మధ్యా సన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తీసుకురావడానికి గ్రామ పెద్దలను తీసుకుని వీర్రాజు ఈదులగూడెం వెళ్లాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి వీర్రాజు అడ్డు వస్తున్నాడనే కారణంతో ఎలాగైనా అతనిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. అందుకు అతనిని హత్య చేయాలనుకున్నారు. ఈ నెల 9న రాత్రి 10.30 గంటల సమయంలో శ్రావణి ఇంటికి వచ్చిన యువకుడు వీర్రాజుతో మాట్లాడాలని చెప్పి బయటకు తీసుకువెళ్ళాడు. మద్యం తాగించి సమీప పొలాల్లోకి తీసుకెళ్లాడు.

మద్యం మత్తులో ఉన్న వీర్రాజుపై తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి పారిపోయాడు. దీంతో వీర్రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లారాక విషయం తెలుసుకున్న గ్రామస్థులు వీర్రాజు తల్లికి సమాచారం అందించారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెదపాడు పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏలూరు రూరల్‌ పోలీసులు ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలించి ఆఖరికి పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని నేర వార్తల కోసం చూడండి..