యువతితో భర్త ప్రేమాయణం..భార్య షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే..?

|

Feb 16, 2022 | 7:09 PM

రైల్వే శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. విధి నిర్వహణలో భాగంగా తనకు వేరే ప్రాంతానికి బదిలీ అయింది. దీంతో భార్యను వదిలి అక్కడికి వెళ్లాడు....

యువతితో భర్త ప్రేమాయణం..భార్య షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే..?
Bhopal Marriage
Follow us on

రైల్వే శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. విధి నిర్వహణలో భాగంగా తనకు వేరే ప్రాంతానికి బదిలీ అయింది. దీంతో భార్యను వదిలి అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ యువతితో సంబంధం ఏర్పడింది. తనకు వివాహం కాలేదని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులకు అసలు విషయం తెలుసుకున్న యువతి.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం పోతుందేమోనన్న అనుమానంతో అతని భార్య ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంకది. తన భర్తతో ఆ యువతికి పెళ్లి చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దశరథ్ రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా దశరథ్ కు 2018లో కరోండ్ ప్రాంతానికి బదిలీ అయింది. అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తనకు వివాహం కాలేదని చెప్పి ఆ యువతిని ప్రేమలోకి దించాడు. కొంతకాలం ప్రేమాయణం కొనసాగించాడు. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

అంతా సక్రమంగా సాగిపోతున్న సమయంలో… దశరథ్ కు వివాహం అయ్యిందన్న విషయం యువతికి తెలిసింది. అతనికి అంతకు ముందే పెళ్లయిందని, ఉద్యోగ నిమిత్తం కరోండ్ ప్రాంతానికి వచ్చాడని గ్రహించి, పోలీసులకు ఆశ్రయించింది. తనను మోసం చేసి, శారీరకంగా లోబరుచుకున్నాడని దశరథ్ పై అత్యాచారం కేసు పెట్టింది. విషయం తెలుసుకున్న దశరథ్ భార్య వినిత.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భర్త దశరథ్ కు ఆ యువతితో పెళ్లి చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ దశరథ్ దంపతులు ఆ యువతిని వేధించడం ప్రారంభించారు. ఆమెను ఇంటి నుంచి బయటకు తరిమేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధిత యువతి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read

Shocking Video: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి..! షాక్‌ తిన్న వైద్యులు..! వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఇదేం పిచ్చి బాబు.. ఒంటినిండా కీటకాలే…! గిన్నిస్‌ రికార్డ్‌ కోసం టాటూలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ఈ కింగ్ కోబ్రా దాడి చూస్తే దడ పుట్టాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో